అతి తక్కువ రోజులు అసెంబ్లీ నడిపిన చరిత్ర తెలంగాణదే..: భట్టి
TeluguStop.com
తెలంగాణ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.యావత్ భారతదేశంలోనే అతి తక్కువ రోజులు అసెంబ్లీ నడిపిన చరిత్ర తెలంగాణ సర్కార్ దేనని విమర్శించారు.
పోడు భూములు, ధరణి పోర్టల్, సింగరేణి, బీసీ సబ్ ప్లాన్ వంటి అంశాలపై అసెంబ్లీలో చర్చించాలన్నారు.
అదేవిధంగా మైనారిటీ, ఎస్సీ సబ్ ప్లాన్ పై చర్చించడంతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తామని చెప్పారు.
సభ ఎక్కువ రోజులు నడపాలని కోరుతూ స్పీకర్ కు లేఖ రాస్తామని తెలిపారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో సభను నిర్వహించాలని భట్టి డిమాండ్ చేశారు.రుణమాఫీ వడ్డీతో సహా చెల్లించాలన్న ఆయన అసెంబ్లీ వేదికగా ఏ సమస్యలను లేవనెత్తాలో తమకు తెలుసని వెల్లడించారు.
మహా కుంభమేళాలో హల్చల్ చేసిన నకిలీ షేక్.. ఉతికారేసిన సాధువులు