వరుస సినిమాలు చేస్తున్న ప్రభాస్( Prabhas ) సినిమాల లిస్ట్ లో ఉన్న సినిమా ప్రాజెక్ట్ కే… వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్( Director Nag Ashwin ) డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతుంది…ఈ సినిమా ను ఇంటర్నేషనల్ మార్కెట్స్ ను టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు.దీపికా పదుకొనె తెలుగులో నటిస్తున్న స్ట్రైట్ మూవీ ఇది.
అలాగే అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.తాజాగా ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం నుండి గ్లిమ్ప్స్ ని విడుదల చేశారు.
అలాగే ఈ చిత్రానికి టైటిల్ ‘కల్కి 2898 -AD’( Kalki 2898AD ) అని ఫిక్స్ చేశారు…
భవిష్యత్తులో సంభవించబోయే యుగాంతానికి సంబంధించిన కథ ఇది అని తెలుస్తుంది.సూపర్ పవర్స్ కలిగిన ఓ హీరో జనాలను ఎలా కాపాడాడు అనేది థీమ్ అని స్పష్టమవుతుంది.
అయితే ఈ చిత్రంలో మైథలాజికల్ టచ్ కూడా ఉంటుంది అని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది.పురాణాల్లో చావే లేని వాళ్ళుగా ఆంజనేయుడు, అశ్వద్ధామ ల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు.ఇప్పటికీ వీళ్ళు బ్రతికే ఉన్నారు అనేది కొంతమంది నమ్మకం…
ఆంజనేయుడు( Hanuman ) ఇంకా హిమాలయాల్లో తిరుగుతూ ఉంటాడని అనుకునే వాళ్ళు ఉన్నారు.అశ్వద్ధామ( Ashwathhama ) కూడా బ్రతికే ఉన్నాడు అనేది ఇంకొంతమంది నమ్మకం.ఒకవేళ అశ్వద్ధామ బ్రతికుంటే ఎలా ఉంటుంది.? అనే థీమ్ తో ఈ చిత్రంలో అమితాబ్ పాత్రని డిజైన్ చేసినట్లు ఎప్పటి నుండో టాక్ నడుస్తుంది.అయితే మైథాలజీ కథాంశాలతో సినిమాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.రీసెంట్ గా ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో దర్శకుడు ఓం చాలా తప్పులు చేశాడు…
రామాయణాన్ని ( Ramayanam ) అతనికి నచ్చినట్టు , పేరడీ చేసినట్లు తీశాడు.అందుకే మొదటి వీకెండ్ తర్వాత ఆ మూవీ కలెక్షన్స్ చాలా దారుణంగా పడిపోయాయి.ముఖ్యంగా నార్త్ లో ఆ మూవీ కలెక్షన్స్ పై పెద్ద దెబ్బ పడింది అంటే.
దానికి కారణం అదే అని చెప్పాలి.ప్రాజెక్టు కె విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ అలాంటి తప్పే చేస్తే కనుక అతను కూడా చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది…అయితే ఇది కూడా మైథలాజీకల్ రిఫరెన్స్ తో రూపొందించిన సినిమా అయితే దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది…దీంతో చాలా మంది హిందూ సంఘాల నేతలు అటు ప్రభాస్ కి ఇటు నాగ్ అశ్విన్ కి వార్నింగ్ లు కూడా ఇస్తున్నట్టు గా తెలుస్తుంది…
.