జగన్ కు షర్మిలతో ముప్పు పొంచిఉందా ?

ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డికి ( CM Jagan Mohan Reddy )తన సొంత చెల్లి YS Avinash Reddy తో ఇబ్బందులు తప్పెల కనిపించడం లేదు.గతంలో తన అన్న కోసం వైసీపీ పార్టీ గెలుపు కోసం ఎంతగానో కృషి చేసిన వైఎస్ షర్మిల.

 Is There A Threat To Jagan With Sharmila , Sharmila , Cm Jagan , Ycp Party, Viv-TeluguStop.com

ఇప్పుడు జగన్ కు తలపోటుగా మారుతోంది.జగన్ పై ఆమె వైఖరి, చేస్తున్న వ్యాఖ్యలు అన్నీ కూడా.

జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టె విధంగానే ఉన్నాయి.తన అన్నతో విభేదాల కారణంగా తెలంగాణకు మకాం మార్చిన షర్మిల 2021లో వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీ కూడా స్థాపించి రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి వీలు చిక్కినప్పుడల్లా తన అన్న జగన్ కు చురకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారు.

Telugu Cm Jagan, Viveka, Ycp, Ys Jagan, Ys Sharmila-Politics

ఇదే ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడడం లేదు.కుటుంబంలోని విభేదాలను జగన్ ఎప్పుడు బహిరంగంగా ప్రస్తావించలేదు.కానీ షర్మిల మాత్రం అన్నతో ఉన్న విభేదాలను పలు మార్లు పరోక్షంగా ప్రస్తావిస్తూ వస్తోంది.

ఆ మద్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది షర్మిల.ఇదిలా ఉంచితే తన బాబాయ్ వివేకా హత్య( Viveka ) కేసులో దొషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని జగన్ పై పరోక్షంగానే ఘాటుగా విమర్శలు ఎక్కుబెట్టారు షర్మిల.

అసలే వివేకా హత్య కేసులో వైఎస్ జగన్ పాత్ర ఏమిటనే ప్రశ్న ఏపీలో ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతూనే ఉంది.

Telugu Cm Jagan, Viveka, Ycp, Ys Jagan, Ys Sharmila-Politics

ఇదిలా ఉండగానే మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు తన సోదరి షర్మిల కూడా తనవైపే వెళ్ళేత్తి చూపిస్తుండడంతో జగన్ ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్లు విశ్లేషకుల అభిప్రాయం.ఇక ఇప్పటికే అవినాష్ రెడ్డి( YS Avinash Reddy ) చుట్టూ తిరుగుతున్న వివేకా కేసులో ఫైనల్ చార్జ్ షీట్ ను సుప్రీం కోర్టుకు సమర్పించింది సీబీఐ.ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటనే చార్జ్ షీట్ లో సాక్షిగా షర్మిల పేరును చేర్చింది తెలంగాణ సీబీఐ.

గతం ఏడాది అక్టోబర్ నెలలో షర్మిల చేత తెలంగాణ సీబీఐ వాంగ్మూలం తీసుకున్న సంగతి తెలిసిందే.ఆ వాంగ్మూలంలో వివేకా హత్యలో రాజకీయ కోణం దాగి ఉందని షర్మిల స్పష్టం చేసింది.

దీంతో ఈ కేసులో ఇప్పుడు ఆమె నే సాక్షిగా మారింది.దీంతో షర్మిల కారణంగా జగన్ కు ఇక్కట్లు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరి ఈ అన్నచెల్లెళ్ల వార్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube