ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ షెడ్ ల నిర్మాణాలు పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.

రాజన్న సిరిసిల్ల జిల్లా: గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ షెడ్ లను పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanthi ) ఆదేశించారు.గురువారం ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.

 Construction Of Plastic Waste Management Sheds Should Be Completed And Made Avai-TeluguStop.com

సత్య ప్రసాద్ తో కలిసి వేములవాడ మండలం మారుపాక, వేములవాడ( Vemulawada ) గ్రామీణ మండలం మర్రిపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ షెడ్ ల నిర్మాణాల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కీలకమైన అంశమని అన్నారు.

ఒక్కో మండలానికి సంబంధించి ఒక గ్రామం ఎంపిక చేసి 5 లక్షల రూపాయలతో ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ షెడ్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.వేములవాడ మండల పరిధిలో గల గ్రామాల్లోని కంపోస్ట్ షెడ్ లలో వేరు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను మారుపాక గ్రామంలోని ప్లాస్టిక్ వ్యర్థాల( Plastic waste ) నిర్వహణ షెడ్ కు,వేములవాడ గ్రామీణ మండలానికి సంబంధించి మర్రిపల్లి లోని ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ షెడ్ కు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ లకు సూచించారు.

ఇక్కడ సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను జిల్లా కేంద్రంలోని డీఆర్సీసీ కేంద్రానికి, ఏజెన్సీలకు విక్రయించాలని అన్నారు.రెండు రోజుల్లోగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ షెడ్ లను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే వీటికి సంబంధించిన రిజిష్టర్ లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ, సక్రమంగా నిర్వహించాలని పంచాయితీ కార్యదర్శులకు సూచించారు.ఈ పరిశీలనలో జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి రవీందర్, పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాష్, అదనపు డీఆర్డీఓ మదన్ మోహన్, ఎంపీడీఓ లు శ్రీధర్, రాంరెడ్డి, తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube