యాక్సిస్ బ్యాంక్ సరికొత్త ఫీచర్.. ఒకే యాప్ లో మీ అన్ని బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు..!

ప్రస్తుతం చాలామంది ఒక బ్యాంక్ అకౌంట్ కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ లను అవసరాల రీత్యా వాడుతూనే ఉంటారు.ముఖ్యంగా ఉద్యోగస్తులు శాలరీ కోసం ఒక అకౌంట్, పర్సనల్ గా మరో బ్యాంక్ అకౌంట్ మెయింటెన్ చేస్తూ ఉంటారు.

 Axis Bank's New Feature.. All Your Bank Balance Details In One App..! ,axis Bank-TeluguStop.com

అయితే చాలామందికి ఏ బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో గుర్తు ఉండదు.బ్యాలెన్స్ చెక్ చేయాలంటే వేరు వేరు యాప్లను ఉపయోగించాల్సిందే.

ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు యాక్సిస్ బ్యాంక్ ఓ సరికొత్త ఫీచర్ ను అందుబాటు లోకి తెచ్చింది.యాక్సిస్ బ్యాంక్ యాప్ లో వన్ వ్యూ ఫీచర్( One view feature ) ను సరికొత్తగా అందుబాటులోకి తెచ్చింది.

ఈ ఫీచర్ తో కేవలం యాక్సిస్ బ్యాంక్ ఖాతాలో ఉండే బ్యాలెన్స్ చెక్ చేయడమే కాకుండా ఇతర బ్యాంక్ అకౌంట్ల వివరాలు యాక్సిస్ చేసుకోవచ్చు.ఈ ఫీచర్ అకౌంట్ అగ్రిగేటర్ లాగా పనిచేస్తుంది.

Telugu Axis Bank, Bank, Latest Telugu, App, View-Technology Telugu

ఈ ఫీచర్ ఎలా ఉపయోగించాలి.ముందు ఎలా లాగిన్ అవ్వాలి అనే వివరాలు చూద్దాం.యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు ముందుగా ఫోన్లో యాక్సిస్ బ్యాంక్ ( Axis Bank )మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి.ఆ తర్వాత యాప్ ఓపెన్ చేస్తే వన్ వ్యూ ఫీచర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.

అని క్లిక్ చేస్తే ఓటీపీ వెరిఫికేషన్ అడుగుతుంది.రిజిస్టర్డ్ మొబైల్ కు ఓటీపీ వస్తుంది.

ఓటీపీ నమోదు చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు కనిపిస్తాయి.

Telugu Axis Bank, Bank, Latest Telugu, App, View-Technology Telugu

ఈ ఫీచర్ ద్వారా ఏ బ్యాంక్ అకౌంట్(Bank account ) యాక్సిస్ చేయాలనుకుంటే ఆ అకౌంట్ సెలెక్ట్ చేయాలి.ఆ తరువాత అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.అంతే కాదు లింక్ చేసిన అకౌంట్లో జరిపిన లావాదేవీల వివరాలను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇమెయిల్ కూడా చేసుకోవచ్చు.ఈ ఫీచర్ ద్వారా కేవలం మీ ఇతర బ్యాంక్ అకౌంట్ల వివరాలను మాత్రమే కనిపిస్తాయి.

లావాదేవీలు జరపడానికి అవకాశం ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube