హిందూమతంలో( Hinduism ) భక్తులు చాలా ఇష్టంగా, శ్రద్ధగా ఎంతోమంది దైవాలను పూజిస్తారు.అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతో వారిని కొలుస్తారు.
అయితే అలాంటి దైవాలలో రాముడు( Ramudu ) కూడా ఒకరు.చాలామంది రాముడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా చోట్ల రాముడికి సంబంధించిన ఆలయాలు ఉన్నాయి.ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో రాముడిని కొలిచేవారు ఎక్కువమంది ఉండగా రామాలయాలు చాలానే ఉన్నాయి.
అయితే అయోధ్యలో రాముడు తన ముగ్గురు సోదరులతో కలిసి పిల్లల రూపంలో కూర్చుని ఉంటారు.తాత్కాలిక ఆలయంలో వెండి సింహాసనంపై కూర్చున్న రామ్ లల్లా రంగురంగుల దుస్తులను ధరించి రామభక్తులకు అద్భుతంగా దర్శనం ఇస్తారు.
బజరంగబలి రామ్ లల్లా( Bajrangbali Ram Lalla ) కుడి వైపున కూర్చుని ఉంటారు.అయితే రామ భక్తులు తాత్కాలిక ఆలయానికి చేరుకున్న సమయంలో వారు రామ్ లాల్లా తో పాటు వాయు పుత్రుడు హనుమంతుడిని( Lord Hanuman ) కూడా చూస్తారు.అలాగే రాముడు తో పాటు హనుమంతుడిని కూడా పూజిస్తారు.ఇక రామ్ లల్లాకు ఎడమ వైపున శాలిగ్రామం ఉంటుంది.ఇది ప్రధాన దేవాలయాలలో శాలిగ్రామంతో చెక్కిన దేవుడిని ప్రతిష్టించడం శుభప్రదంగా భావిస్తారు.అయితే తాత్కాలిక ఆలయాల్లోనే కాకుండా దేశంలోని దేవాలయాల్లో శాలిగ్రామ దేవుడు ( God of Saligrama )కొలువై ఉంటారు.
శాలిగ్రామ రాతితో ఐదేళ్ల వయసున్న రాముల విగ్రహాన్ని తయారు చేస్తారు.ఇక విగ్రహం తయారీ ఇప్పటికే మొదటి దశ కూడా పూర్తి చేసుకుంది.అయితే ఇప్పుడు రాముల విగ్రహాన్ని తయారు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు తయారు చేస్తున్నారు.అలాగే విగ్రహాన్ని తయారు చేసేందుకు విగ్రహం స్కెచ్ కూడా ఇప్పటికే పూర్తి చేశారు.
వీరిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు అయోధ్య కు చేరుకుంటూ ఉంటారు.అక్కడికి చేరుకున్న తర్వాత భక్తులు రాముడితోపాటు ఆలయంలో కొలువున్న తన సోదరులకు కూడా భక్తులు దర్శించుకుంటారు.
DEVOTIONAL