సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి, విడాకులు అన్నవి కామన్.చాలామంది సెలబ్రిటీలు( Celebrities ) ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోతూ ఉంటారు.
అలా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో రెండు మూడు పెళ్లిళ్లు అయిన వారు చాలామంది ఉన్నారు.కానీ సినిమా ఇండస్ట్రీలో పిల్లలే తల్లిదండ్రులకు మళ్లీ పెళ్లి చేయడం అన్నది చాలా రేర్ గా జరుగుతూ ఉంటుందని చెప్పవచ్చు.
తాజాగా ఒక బుల్లితెర నటి కూడా అటువంటి నిర్ణయం తీసుకుంది.తన తన దగ్గర రెండవ వివాహం చేయాలని నటి నిశ్చయించుకుంది.
మరి ఆ నటి ఎవరు ఎందుకు తన తండ్రిగా రెండవ వివాహం చేయాలనుకుంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఆ నటి మరెవరో కాదు బాలీవుడ్ బుల్లితెర నటి సుంబుల్ తౌకీర్( Sumbul Taukeer ).ఈమె గురించి మనందరికీ తెలిసిందే.ప్రముఖ హిందీ టీవీ షోలలో ఎక్కువగా కనిపించింది.
సుంబుల్ తన నటనా జీవితాన్ని 2013 షో జోధా అక్బర్‌తో ప్రారంభించింది.ఆమె టీవీ షో ఇమ్లీ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్- 16 సీజన్‌లో కనిపించింది.బిగ్ హౌస్‌లో అడుగుపెట్టిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది.2018లో చంద్రగుప్త మౌర్యలో( Chandragupta Maurya ) కూడా కనిపించింది.అయితే తాజాగా ఆమె తన తండ్రికి రెండో పెళ్లి చేసి వార్తల్లో నిలిచింది.
దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది.సుంబుల్ తండ్రి తౌకీర్ ఖాన్ జూన్ 15న పెళ్లి చేసుకున్నారు.వివాహానికి సంబంధించిన ఫోటోలను నటి తాజాగా అభిమానులతో పంచుకుంది.దీంతో ఆమె చేసిన పనికి కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.తండ్రిపై ప్రేమను చాటుకున్నారంటూ పొగుడ్తల వర్షం కురిపిస్తున్నారు.కాగా తన తండ్రికి రెండో వివాహం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది సుంబుల్.
మా తండ్రికి భార్యతో పాటు ఓ సోదరి కూడా మాతో రాబోతోంది వెల్లడించింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు శుభాకాంక్షలు తెలుపుతుండగా మరికొందరు నెటిజన్స్ నెగటివ్ గా కామెంట్ చేస్తున్నారు.