పక్షం రోజుల్లో మల్కపేట జలాశయాన్ని సిఎం కేసిఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం - మంత్రి కెటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ,ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ శ్రీ వై.వి.

 Will Open Malkapet Reservoir By The Hands Of Cm Kcr Minister Ktr Details, Malka-TeluguStop.com

సుబ్బారెడ్డితో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా మంత్రి కే టి రామారావు మాట్లాడుతూ….

టి టి డి ఆర్థిక సహకారంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశక్తి ,ప్రభ కలిగిన ప్రసిద్ధ దేవాలయాలను కొంత డబ్బుతో భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తూ పూర్వ వైభవం తేవచ్చు చేయవచ్చు అని ఒక రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డిలు సానుకూలంగా స్పందించారనీ అన్నారు.ఫలితంగా ఇప్పుడు సిరిసిల్లలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎల్లారెడ్డిపేటలోని వేణుగోపాల స్వామి ఆలయంలో పునరుద్ధరణ పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

స్వరాస్ట్రం తెలంగాణ లో సిఎం కేసిఆర్ నేతృత్వంలో నీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు.గుడులు, బడులను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు .గంభీరావు పేటలో కేజీ టు పీజీ క్యాంపస్ ను అభివృద్ధి చేసిన మాదిరే ఎల్లారెడ్డి పేట ప్రభుత్వ స్కూల్ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.తెలంగాణ లోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు మనబడి కార్యక్రమం కింద అభివృధి చేస్తున్నామని తెలిపారు.

మండు వేసవిలో తెలంగాణలోని చెరువులు, కుంటలు, నదులు, ఎరులు,కాల్వలు జలకళ ను సంతరించుకున్నాయని అన్నారు.సిఎం కేసిఆర్ సంకల్పంతో తెలంగాణ సస్య సస్య శ్యామలం అయ్యిందని అన్నారు.

హెలికాప్టర్ లో వస్తున్నప్పుడు కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, గౌరవెళ్లి ప్రోజెక్ట్, మధ్య మానేరు జలాశయాలతో తెలంగాణ నిండు కుండ ను తలపిస్తుందన్నారు.

Telugu Rajannasircilla, Sudheer, Telugudistricts-Telugu Districts

ఒకప్పుడు కొనసీమ లో సినిమాలు తీసేవారు… 9 ఎండ్లలో జరిగిన అభివృద్ధి వల్ల ఇప్పుడు తెలంగాణ లో సినిమా తీసేందుకు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు.తెలుగు ప్రాంతాలు భూభాగాలు గా విడిపోయిన….అన్నదమ్ములుగా కలిసి ఉండాలన్నది, అభివృద్ధి సాధించాలన్నది మా విధానం అన్నారు.

దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలతో పాటు బ్రాహ్మణ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.అణగారినవర్గాలనే కాదు అగ్రవర్ణ పేదలను కూడ ప్రభుత్వం కడుపులో పెట్టుకుంటుందన్నారు.

దమ్మున్న ముఖ్యమంత్రి కాబట్టే సిఎం కేసిఆర్ దళిత బంధు వంటి పథకం అమలు చేస్తున్నారని అన్నారు .పక్షం, 20 రోజుల్లో….మల్కపేట జలాశయాన్ని సిఎం కేసిఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Telugu Rajannasircilla, Sudheer, Telugudistricts-Telugu Districts

మల్కపేట జలాశయం తో ఎల్లారెడ్డి పేట శాశ్వతంగా సస్య శ్యామలం కానుందని మంత్రి తెలిపారు.కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.దేశ జనాభాలో 3 శాతం జనాభా కలిగిన తెలంగాణ కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు అందించే జాతీయ అవార్డు లలో 30 శాతం అవార్డులను సాధించాయని అన్నారు.

పట్టణాలు కూడా అదే బాటలో నడుస్తూ 25 అవార్డులు అందుకున్నాయని అన్నారు.సిరిసిల్ల, ఎల్లారెడ్డి పేట లో ఆలయాల పున నిర్మాణం కు సహకరించిన టిటిడి గంభీరావుపేట సీతారామ ఆలయం పున నిర్మాణం కు కూడా ఆర్థిక సహాయం అందజేయవలసిందిగా కోరగా టిటిడి ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని అన్నారు.

టిటిడి ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.దేశ వ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం లో భాగంగా కొత్త ఆలయాలను నిర్మించడం, పునరుద్ధరణ మొదలైన కార్యక్రమాలను టిటిడి గడిచిన 4 ఎండ్లుగా చేస్తుందన్నారు .బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు ఉండే చోట పెద్ద ఎత్తున ఆలయాలను నిర్మిస్తున్నామని అన్నారు.కరీంనగర్ లో 20 కోట్లతో శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సిఎం కేసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.గడిచిన 9 ఎండ్లలో తెలంగాణ రూపు రేఖలు మారాయని అన్నారు.

బోయినిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ… మంత్రి కే తారక రామారావు విజ్ఞప్తి చేసిన వెంటనే శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం పున: నిర్మాణం అడిగిన వెంటనే టిటిడి ఛైర్మన్ సానుకూలంగా స్పందించారనీ అన్నారు.రూ.2 కోట్ల రూపాయలతో ఆలయ పున: నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube