ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే..? ఈ నాలుగు పనులు చేస్తే చాలు..!

ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటాడు.కానీ లక్ష్మీదేవి అనుగ్రహం( Goddess Lakshmi ) లేకపోతే తన జీవితంలో ఎంత సంపాదించినా కూడా అది నిలవదు.

 To Always Have The Grace Of Goddess Lakshmi Just Do These Four Things , Goddess-TeluguStop.com

అయితే లక్ష్మీదేవి అనుగ్రహించిన వ్యక్తి మాత్రమే తన జీవితంలో భారీగా డబ్బు, సంపదను పొందగలుగుతాడు.సంపదలకు దేవత అయిన తల్లి లక్ష్మీ చంచలమైనది, ఆమె ఎక్కువ సేపు ఒకే చోట ఉండదు.

అందుకే ఇంట్లో లక్ష్మీదేవి సదా నివసించాలని అనుకున్న వారు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయవలసి ఉంటుంది.అయితే శాస్త్రాల ప్రకారం ప్రతిరోజు కొన్ని చర్యలు చేయాలి.

అలాంటప్పుడే లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం మీపై ఉంటుంది.

Telugu Bhakti, Devotional, Goddess Lakshmi, Happiness, Lord Vishnu, Energy, Pros

దీంతో ఇంట్లో ఆనందం, శ్రేయస్సు( Happiness, prosperity ) కూడా ఉంటుంది.తులసి దేవి ( Goddess Tulsi )లక్ష్మి స్వరూపముగా పరిగణించబడుతుంది.తులసి మొక్క ఉన్న ఇంట్లో విష్ణుమూర్తి ( Lord Vishnu )అనుగ్రహం శాశ్వతంగా ఉంటుంది.

అందుకే ఇంట్లో తులసి మొక్కలు నాటాలి.ఆ తర్వాత ప్రతిరోజూ తులసి మొక్కను పూజ చేసి నీరు సమర్పించాలి.

అలాగే తులసిని ఇంటికి ఇషాన్య దిశలో నాటాలి.ఇక శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతికూలతను తొలగించడానికి ఆవు పేడతో చేసిన భరణిపై ధూపం, గుగ్గలు కాల్చాలి.

దీని పొగను ప్రతి మూలలో వ్యాప్తి చేయాలి.ఇలా మంగళవారం, గురువారం, శనివారం చేయాలి.

Telugu Bhakti, Devotional, Goddess Lakshmi, Happiness, Lord Vishnu, Energy, Pros

దీంతో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి సానుకూలత వస్తుంది.ఇక ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి.ఇక లక్ష్మి దేవి అనుగ్రహం పొందాలనుకున్నవారు ప్రతి శనివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అరటి చెట్టు కింద ఆవాల నూనె దీపాన్ని వెలిగించాలి.ఆ తర్వాత ఆ చెట్టుకు మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి.

ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.ఇక ఆ తర్వాత ప్రతినెలా మీ జీవితంలో కొంత భాగాన్ని దేవుని పేరుమీద ఆలయానికి విరాళంగా ఇవ్వాలి.

ఇలా చేయడం వలన దేవుని ఆశీర్వాదంతో మీ దగ్గర డబ్బు ఎల్లప్పుడూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube