ఆప్రతి ఏడాది హిందువులు జ్యేష్ఠ మాసంలోని శుక్లాపక్ష ఏకాదశి తిథి గాయత్రీ దేవి జన్మదినం జరుపుకుంటూ ఉంటారు.హిందూమతం ప్రకారం గాయత్రి జయంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఈ రోజున గాయత్రి మాతను ఎవరైతే నియమ నిష్టతో పూజిస్తారో వారికి సుఖసంతోషాలు లభిస్తాయని నమ్ముతారు.అంతే కాకుండా గాయత్రీ జయంతి రోజున గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ సంవత్సరం గాయత్రీ జయంతి( Gayatri Jayanti ) ఎప్పుడు వస్తుంది.దాని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ట శుక్ల ఏకాదశి రోజు హిందువులు గాయత్రీ జయంతిని ఘనంగా జరుపుకుంటారు.ఈ సంవత్సరం మే 31వ తేదీ బుధవారం గాయత్రి జయంతి జరుపుకుంటారు.
ఈ రోజున నిర్జల ఏకాదశి( Nirjala Ekadashi ) కూడా జరుపుకుంటారు.అయితే మే 30 2023న మధ్యాహ్నం ఒకటి ఏడు నిమిషాల నుంచి పూజా సమయం మొదలవుతుంది.
ఇది మసటి రోజు అంటే మే 31వ తేదీ మధ్యాహ్నం 1:45 నిమిషములకు ముగుస్తుంది.హిందు మత విశ్వాసం ప్రకారం గాయత్రి జయంతి రోజున గాయత్రి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి.ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, సంపద లభిస్తాయి.అలాగే మీ లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చు.సనాతన సంప్రదాయం ప్రకారం గాయత్రీ అమ్మవారు 4 వేదాలకు మూలంగా ప్రజలు నమ్ముతారు.గాయత్రి అమ్మవారిని సరస్వతీ,( Saraswati devi ) లక్ష్మీ, కాళీ మాతకు చిహ్నంగా పరిగణిస్తారు.
వేదాలు గాయత్రీ దేవి నుంచి ఉద్భవించాయి.కాబట్టి ఆమెను వేదమాత అని కూడా పిలుస్తారు.సనాతన ధర్మం లో వేదాల ప్రాముఖ్యత గురించి తెలిపారు.ఎల్లప్పుడైనా మనసింగా ఇబ్బంది పడుతున్న, మీ కెరీర్ లో గొప్ప విజయాలు సాధించాలనుకున్న నిజమైన హృదయంతో గాయత్రీ దేవిని పూజించాలి.
ఇలా చేయడం వల్ల మీ పనులన్నీ త్వరగా పూర్తి అవుతాయి.
GENERAL-TELUGU