జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అసలు విషయం చెప్పేశారు.ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే తన లక్ష్యం అని, ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు చీలకుండా అన్ని పార్టీలను పొత్తులకు ఒప్పిస్తానని పవన్ చెప్పేశారు.
ఇక సీఎం సీటు విషయంలోనూ క్లారిటీ ఇచ్చేశారు.మనం కోరుకుంటే వచ్చేది కాదని, మన బలం తక్కువగా ఉన్నప్పుడు ఆ సీటు ఆశించడం కరెక్ట్ కాదని, టిడిపి అధినేత స్థానంలో తాను ఉన్నా, సీఎం సీటు ఇచ్చేందుకు ఒప్పుకోనని, బలం లేదు కాబట్టే సీఎం సీటు ఆశించడం లేదని పవన్ చెప్పేశారు.
ఇక టిడిపి తో జనసేన పొత్తు( TDP Janasena ) అనివార్యం అని పవన్ తేల్చేశారు.ఇక బిజెపి కూడా తమతో కలిసి రావాలని పవన్ కోరారు.
ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి టిడిపితో పొత్తు విషయమే బిజెపి ( BJP ) అగ్ర నేతలను ఒప్పించే ప్రయత్నం చేశానని పవన్ క్లారిటీ ఇచ్చేశారు.
బిజెపి ,జనసేన పొత్తు వల్ల ఓట్ల చీలిక పెరుగుతుందే తప్ప, కలిసి రాదని అదే టిడిపి తో కలిసి వెళ్తే లాభం ఉంటుందని పవన్ అంచనా వేస్తున్నారు.అందుకే టిడిపి జనసేన బిజెపి కలిసి వైసిపిని ఎదుర్కోవాలనే విషయాన్ని పదేపదే పవన్ ప్రస్తావిస్తున్నారు.ఈ విషయంలో బిజెపి పెద్దలను ఒప్పిస్తాను అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పటి నుంచో బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అనేక సందర్భాల్లో ఆ విషయాన్ని వెల్లడించారు .ఎలాగూ జనసేన తమతో కలిసి వస్తుంది కనుక వైసిపిని సులువుగా ఓడించవచ్చని బాబు అంచనా వేస్తున్నారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకటనతో టిడిపి తో జనసేన కలిసి నడవబోతుందనే0 విషయం క్లారిటీ వచ్చేసింది ఇక ఈ విషయంలో తేల్చుకోవాల్సింది వైసీపీనే ఇప్పటికే బీజేపీ, వైసీపీకి అనేక రకాలుగా మద్దతిస్తుందని, పైకి విమర్శలు చేస్తున్న, వైసీపీపై సానుకూలంగానే వ్యవహరిస్తుందనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు బిజెపి ఈ పొత్తులు విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే ఎప్పటి నుంచో టీడీపీతో పొత్తు విషయంలో బిజెపి అగ్ర నేతలు అంత ఆసక్తి చూపించడం లేదు.గతంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న సమయంలో వ్యవహరించిన తీరు, ఆ తరువాత చేసిన విమర్శలు ,జరిగిన సంఘటనలన్నీ బిజెపి అగ్ర నాయకులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.దీంతో ఈ పొత్తుల విషయంలో బీజేపీ అగ్రనేతల నిర్ణయం పైనే అందరికీ ఆసక్తి నెలకొంది.