మొన్నటి వరకు ఏజెంట్( Agent ) ప్రమోషన్స్ చేయడం లేదు.ఇలా అయితే ఇంత బడ్జెట్ సినిమా గట్టెక్కడం ఎలా అని అనుకున్నారు అక్కినేని ఫ్యాన్స్.
కానీ గత పది రోజులుగా ఏజెంట్ టీమ్ అంతా కలిసి నాన్ స్టాప్ గా చేస్తున్న ప్రమోషన్స్ కారణంగా ఈ సినిమాకు హైప్ బాగానే పెరిగింది అనే చెప్పాలి.గత పది రోజులుగా మేకర్స్ వరుసగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ప్రెస్ మీట్స్ పెడుతూ వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఏజెంట్ సినిమాను వార్తల్లో నిలిచేలా చేయడంలో సక్సెస్ సాధించారు.
అలాగే థియేట్రికల్ ట్రైలర్ తో అంచనాలు మరిన్ని పెంచుకున్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు దగ్గర అవుతున్న క్రమంలో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఈ సినిమా కోసం అఖిల్ మేకోవర్, స్టైల్, వైల్డ్ లుక్స్, యాక్షన్ కు అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు.దీంతో ఎప్పుడెప్పుడు ఈ యాక్షన్ సినిమాను చూస్తామా అని ఎదురు చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది.
తాజాగా బుకింగ్స్ యాప్ లో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు బుకింగ్స్ యాప్ లో ఇంట్రెస్ట్ హెచుపిస్తారు.కానీ ఇప్పుడు అఖిల్( Akhil Akkineni ) సినిమా కోసం లక్షకి పైగానే ఆడియెన్స్ బుక్ మై షో( Book My Show ) యాప్ లో ఇంట్రెస్ట్ చూపించడం సెన్సేషన్ అనే చెప్పాలి.
టైర్ 2 హీరోల్లో మొన్న నాని దసరా తర్వాత ఇప్పుడు అఖిల్ ఏజెంట్ సినిమానే ఈ రేంజ్ లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది.
మొత్తానికి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.ఇక ఈ సినిమాను సురేందర్ 2 సినిమాస్ తో కలిసి ఏకే ఎంటెర్టాన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.అలాగే ఈయనకు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.
కీలక పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడు.హిప్ హప్ తమిజా సంగీతాన్ని అందిస్తుండగా ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.