నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ- టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి

త్వరలోనే నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే భక్తుల‌ సౌఖర్యార్ధం దివ్య దర్శన టోకెన్లు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నాంమని టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి ప్రకటించారు.

 Ttd Eo Av Dharma Reddy Said That They Have Decided To Issue Divya Darshan Tokens-TeluguStop.com

శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి పాల్గోని భక్తులకు సలహాలు, సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడారు.అనంతరం టిటిడి‌ ఈవో ఏవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.టిటిడికి సంబందించిన ఆస్తులపై పూర్తి స్థాయి సమాచారంతో రిజిస్ట్రేషన్ శాఖకు దరఖాస్తు చేస్తాంమని ఆయన వివరించారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత టీటీడీ బడ్జెటు వివరాలు ప్రకటిస్తాంమని ఆయన వెల్లడించారు.

శ్రీవాణి ట్రస్టుకి విరాళం అందించిన భక్తులకు తిరుమలలోని ఏటిజిహెచ్, ఎస్ఎన్జిహెచ్ అతిధి గృహల్లోని 88 గదులను కేటాయిస్తామన్నారు.అదేవిధంగా కాషన్ డిపాజిట్ విధానంపై మరోకసారి పూర్తి స్ధాయిలో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఏప్రిల్ నుండి తిరుమలలో ఎలక్ట్రికల్ ఉచిత బస్సులను అందుబాటులోకి తీసుకొస్తాంమని ఆయన తెలిపారు.ఫిబ్రవరి మాసంలో హుండీ ద్వారా 114.29 కోట్ల ఆదాయం లభించగా, 18.42 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.92.96 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించగా, 34.06 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించరన్నారు.7.21 లక్షల మంది భక్తులు తలనీలాలూ సమర్పించారన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube