ఆర్ఆర్ఆర్ కి జోస్యం చెప్పిన కృష్ణంరాజు భార్య శ్యామల.. దగ్గర్లో ఆస్కార్ ఉందంటూ?

ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు.

 Krishnam Raju Wife Shyamala Devi Interesting Comments On Rrr Details, Shyamala D-TeluguStop.com

గత ఏడాది విడుదలైన ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది.ఈ సినిమా ప్రస్తుతం రికార్డుల మీద రికార్డు సృష్టించడంతోపాటుగా అవార్డుల మీద అవార్డులను అందుకుంటుంది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆర్ఆర్ఆర్ గురించి జపం చేస్తున్నారని చెప్పవచ్చు.అలాగే తెలుగు సినిమాన ఘనంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళికి సినీ జనం నీరాజనాలు పడుతున్నారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించిన రాంచరణ్, ఎన్టీఆర్ ప్రశంసలు అందుకుంటున్నారు.ఆర్ఆర్ఆర్ టీం అనేక అవార్డులతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా ఆర్ఆర్ఆర్ చిత్రం గెలుచుకున్న విషయం తెలిసిందే.

కానీ యావత్ దేశం మొత్తం ఎదురుచూస్తోంది మాత్రం ఆస్కార్ అవార్డు కోసం.

Telugu Krishnam Raju, Natu Natu, Rajamouli, Ram Chran, Rrr Hca Awards, Rrr Oscar

నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్స్ ఫైనల్ నామినేషన్స్ లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర ఆస్కార్స్ అంచనాలపై దివంగత నటుడు హీరో కృష్ణం రాజు సతీమణి శ్యామల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఆర్ఆర్ఆర్ చిత్రం హెచ్ సి ఏ అవార్డ్స్ లో హవా కొనసాగించింది అని తెలిసి చాలా సంతోషించాను.

Telugu Krishnam Raju, Natu Natu, Rajamouli, Ram Chran, Rrr Hca Awards, Rrr Oscar

ఉత్తమ యాక్షన్ చిత్రం, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఉత్తమ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ , స్పాట్ లైట్ అవార్డు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం అవార్డులు గెలుచుకుందని తెలిసింది.ఇదంతా చూస్తుంటే మనకి ఆస్కార్ అవార్డు దగ్గర్లోనే ఉందనిపిస్తోంది అని శ్యామలాదేవి తెలిపారు.కాగా గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినీమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆ సినిమాతో వాళ్ళిద్దరూ పాన్ ఇండియా స్టార్లుగా మారిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube