పదిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలి:కలెక్టర్

సూర్యాపేట జిల్లా:పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు సూచించారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన మండల విద్యాధికారుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పదవ తరగతి ప్రత్యేక తరగతులను ప్రణాళిక బద్దంగా నిర్వహించాలని, విద్యార్థులకు ప్రతిరోజు నిర్దేశించిన మెనూ ప్రకారం స్నాక్స్ అందజేయాలని అన్నారు.

 Effort Should Be Made To Achieve Best Results Out Of Tenth Class Exams : Collect-TeluguStop.com

ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో నిత్యం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వెనకబడిన విద్యార్థుల స్థాయి వారీగా గ్రూపులుగా విభజించి వారిపై ప్రత్యేక శ్రద్ధను చూపాలని సూచించారు.విద్యార్థులకు మానసిక వికాస తరగతులను నిర్వహించి వారిలో పరీక్షల పట్ల ఉన్న భయాందోళన తొలగించాలన్నారు.

తరచుగా తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించి వారికి తగిన సూచనలు చేసి,విద్యార్థులు ఇంటి వద్ద కూడా చదువుకునే సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు.పరీక్షలను సజావుగా నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

ఈ సమావేశంలో డీఈఓ అశోక్,ఎడి శైలజ,మండల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube