నా చిన్న డ్రీమ్ నెరవేరింది... ఈ అవార్డు వారిద్దరికీ అంకితం: రిషబ్ శెట్టి

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి సినిమాలలో కాంతార ఒకటి.హోంభలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ కేవలం 16 కోట్లు బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఊహించని విధంగా అన్ని భాషలలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకొని ఏకంగా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

 My Little Dream Came True This Award Is Dedicated To Both Of Them Rishabh Shetty-TeluguStop.com

ఇలా ఈ సినిమాకు దర్శకుడిగా నటుడిగా వ్యవహరించినటువంటి రిషబ్ శెట్టి పేరు కూడా ఈ ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.

ఇక ఈ సినిమా ద్వారా రిషబ్ శెట్టికి ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అంటుకోవడంతో ఈ సినిమాకు ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చాయి.తాజాగా చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఈ సినిమాకు వరించింది.

ఈ క్రమంలోనే నటుడు రిషబ్ శెట్టి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా ఈయన ఈ అవార్డుపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

కాంతార సినిమా విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.ఈ అవార్డును దివంగత కన్నడ స్టార్‌ నటుడు పునీత్ రాజ్‌కుమార్, లెజెండరీ డైరెక్టర్‌ ఎస్‌కె భగవాన్‌లకు అంకితం చేస్తున్నట్లు తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు.నా చిన్న కోరికను నెరవేర్చిన కాంతార చిత్ర బృందానికి కృతజ్ఞతలు.నా లైఫ్‌కి మూలస్తంభం అయిన ప్రగతి శెట్టి లేకుండా ఇది అసాధ్యం అంటూ ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube