24 ఏళ్ల వివాహ బంధం.. నువ్వక్కడ నేనిక్కడ అంటూ పెళ్లిరోజు జరుపుకున్న సుమ, రాజీవ్!

యాంకర్ సుమ రాజీవ్ కనకాల బంధం గురించి మనకు తెలిసిందే.వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు.

 Suma And Rajiv Celebrated Their 24th Wedding Anniversary ,anchor Suma Rajeev Ka-TeluguStop.com

అయితే వీరి బంధం గురించి బయట ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.సుమ రాజీవ్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారంటూ ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి.

అయితే ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఈ జంట కొట్టి పారేశారు.ఇలా ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ దంపతులు వివాహ బంధంలోకి అడుగుపెట్టి 24 ఏళ్లు అవుతోంది.

ఈ క్రమంలోనే వీరిద్దరూ తమ 24వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.అయితే ఈ వివాహ వార్షికోత్సవానికి వీరిద్దరూ ఒకే చోట లేకపోవడంతో ఇద్దరు కలిసి వీడియో కాల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వెరైటీగా తమ పెళ్ళి రోజును జరుపుకున్నారు.వీడియో కాల్ ద్వారా వీరిద్దరూ కలిసి ఒక పాట రూపంలో తమ మధ్య ఉన్న బంధాన్ని చూపించారు.నువ్వక్కడ.నేనిక్కడ.పాటిక్కడ.

పలుకక్కడ అంటూ సుమ పాడితే.మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా అంటూ రాజీవ్ కనకాల పాడేశాడు.

ఇలా ఇద్దరు తమ మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని బయటపెట్టారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని సుమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.ఇక సుమ ప్రస్తుతం వరుస సినిమా వేడుకలు కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక రాజీవ్ కనకాల సైతం పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.

ఇక 24వ వివాహ వార్షికోత్సవం అని తెలియగానే ఎంతోమంది అభిమానులు యాంకర్ సుమ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube