సాధారణంగా ఎవరికైనా తమ ముఖ చర్మం ఎలాంటి మచ్చలు లేకుండా అందంగా, తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోతూ కనిపించాలని ఉంటుంది.కానీ అటువంటి చర్మం పొందడం అంతా సులభమైన విషయం ఏమీ కాదు.
ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం, జీవనశైలిలో చోటు చేసుకున్న మార్పులు, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి తదితర కారణాల వల్ల ఎప్పుడూ ఏదో ఒక చర్మ సమస్య( Skin problem ) ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.వాటి నుంచి బయటపడటం కోసం ఖరీదైన క్రీమ్, సీరం తదితర ఉత్పత్తులను వాడుతుంటారు.

అయితే వాటి వల్ల ప్రయోజనం ఉంటుందా లేదా అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ స్కిన్ గ్లోయింగ్ పౌడర్ మాత్రం మీకు ఊహించని లాభాలను అందిస్తుంది.ఇది మీ చర్మాన్ని సహజంగానే అందంగా మెరిపిస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పౌడర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు, రెండు టేబుల్ స్పూన్లు పెసలు, రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు, రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసి స్లైట్ గా వేయించుకోవాలి.

ఇలా వేయించుకున్న పదార్థాలను మిక్సీ జార్ లో వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ పీల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood powder ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.
రోజుకు రెండు టేబుల్ స్పూన్ల చొప్పున తయారు చేసుకున్న పౌడర్ ను తీసుకుని వాటర్ లేదా పెరుగు లేదా వాటర్ తో మిక్స్ చేసుకొని ముఖానికి, మెడకు పూతల అప్లై చేసుకోవాలి.ఇరవై నిమిషాల తర్వాత శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
రోజు ఈ విధంగా చేస్తే చర్మంపై మురికి, మృత కణాలు తొలగిపోతాయి.మొటిమలు, మచ్చలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.
ముఖం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.స్కిన్ టైట్ అవుతుంది.
ముడతలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఎలాంటి మచ్చా లేకుండా మీ చర్మం అందంగా కాంతివంతంగా మరియు ఆకర్షణీయంగా మెరుస్తుంది.







