పుస్తకంగా రాబోతున్న నటి శ్రీదేవి జీవిత చరిత్ర!

సాధారణంగా సినీ రంగంలోనూ రాజకీయాలలో లేదా క్రీడ రంగంలోనూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారి జీవిత కథ ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో ఇప్పటికే ఎంతోమంది ప్రముఖ వ్యక్తుల బయోపిక్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే దివంగత నటి శ్రీదేవి బయోపిక్ కూడా వస్తుందని గతంలో వార్తలు వచ్చాయి అయితే తాజాగా ఈమె జీవిత చరిత్ర మొత్తం ఒక పుస్తక రూపంలో రాబోతుందని శ్రీదేవి భర్త నిర్మాత బోనికపూర్ వెల్లడించారు.

 Actress Sridevi Biography Coming As A Book ,actress Sridevi, Actress Sridevi Bio-TeluguStop.com

ఇక ఈయన ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారకంగా ప్రకటించారు.

Telugu Actress Sridevi, Actresssridevi, Bonikapur-Movie

శ్రీదేవి చనిపోయిన ఐదు సంవత్సరాల తర్వాత శ్రీదేవి.ది లైఫ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్ పేరుతో శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తకం రిలీజ్ కాబోతోంది.ఇక ఈ పుస్తకాన్ని స్వయంగా బోనీకపూర్ ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.

వీలైనంత తొందరగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం కోసం తాను ఎదురుచూస్తున్నానని ఈ సందర్భంగా ఈ విషయాన్ని బోనికపూర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.ఇక శ్రీదేవి జీవిత చరిత్రకు సంబంధించిన ఈ పుస్తకాన్ని ప్రముఖ కాలమిస్ట్, రచయిత, పరిశోధకుడు ధీరజ్ కుమార్ రాశారు.

Telugu Actress Sridevi, Actresssridevi, Bonikapur-Movie

ఇక ఈ పుస్తకానికి సంబంధించిన అన్ని హక్కులను వెస్ట్‌ల్యాండ్ బుక్స్‌ సంస్థకు అప్పగించినట్లు సమాచారం.ఇక ఇదే విషయాన్ని వెస్ట్‌ల్యాండ్‌ బుక్స్‌ సంస్థ కూడా అధికారకంగా తెలియజేయడమే కాకుండా బుక్ కి సబంధించిన ఫ్రంట్ పేజ్ ను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా ఈ ఫోటోని షేర్ చేస్తూ దివంగత నటి లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి జీవిత చరిత్ర ఇలా ప్రచురించడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.

ఇలా శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తక రూపంలో రానుందని తెలియడంతో అభిమానులు కూడా ఈ పుస్తకం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube