దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించి సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య రికార్డ్ స్థాయి కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాలోని పూనకాలు లోడింగ్ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
చిరంజీవి, రవితేజ కలిసి వేసే డ్యాన్స్ స్టెప్పులు ఈ సాంగ్ కు హైలెట్ గా నిలిచాయి.చిరంజీవి వయస్సు పెరుగుతున్నా ఆయన ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే ప్రముఖ సినీ నటి లయ పూనకాలు లోడింగ్ సాంగ్ కు డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.తన స్నేహితురాలితో కలిసి లయ డ్యాన్స్ చేయడం గమనార్హం.లయ షేర్ చేసిన ఈ వీడియోకు 15000కు పైగా లైక్స్ వచ్చాయి.ఉదయ ప్రియ అనే ఫ్రెండ్ తో కలిసి లయ డ్యాన్స్ చేయడం గమనార్హం.
లయ అదిరిపోయే స్టెప్పులను చూసిన నెటిజన్లు ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు.నెటిజన్లు చేసిన కామెంట్ల గురించి కూడా లయ రియాక్ట్ కావడంతో పాటు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.లయ ఎనర్జీ లెవెల్స్ సూపర్ అని ఇప్పటికీ యంగ్ గా కనిపిస్తున్నారని మరి కొందరు చెబుతున్నారు.లయ తన సినీ కెరీర్ లో ఎక్కువగా ట్రెడిషనల్ రోల్స్ లో నటించారు.
తక్కువ సినిమాలే చేసినా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న నటీమణులలో లయ కూడా ఒకరు కావడం గమనార్హం.లయ కెరీర్ పరంగా సక్సెస్ కావాలని రీఎంట్రీలో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.