మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లి పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు.అంతేకాకుండా కొన్ని పుణ్యక్షేత్రాలలో దేవదేవతలకు అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు.
అంతేకాకుండా ఇంకొన్ని ఇప్పుడు నక్షత్రాలలో గ్రామ ఉత్సవాలు, ఆరుద్రోత్సవాలు కూడా ఎంతో ఘనంగా వైభవంగా జరుపుతూ ఉంటారు.పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ సేవ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి అరుద్రోత్సవం ఎంతో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా స్వామికి విశేషా అభిషేకాలు చేశారు.
మేధా దక్షిణామూర్తి మాలధారణ స్వాములు హరిద్రోత్సవానికి వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు.
అరుద్రోత్సవానికి హాజరైన స్వాములు ప్రత్యేక అభిషేకాలు కూడా చేశారు.అర్ధరాత్రి 12 గంటలకు భక్తులు జ్యోతి దర్శనం కూడా చేసుకున్నారు.
జ్యోతి దర్శనం తర్వాత త్రికోటేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకం ఎంతో ఘనంగా నిర్వహించారు. విభూది, గంధం, కుంకుమ, పంచదార వివిధ రకాల ఫలాలు, ఎండు ఫలాలు, ఆవు నెయ్యి, పాలు, పెరుగు ఇంకా ఎన్నో ద్రవ్యాలతో స్వామికి ఘనంగా అభిషేకాలు నిర్వహించారు.
ఆ తర్వాత స్వామికి అన్నాభిషేకం కూడా చేశారు.
ఆ తర్వాత రోజు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించరు.ఆరుద్రోత్సవం సందర్భంగా లింగం గుట్ల శివాలయంలో మాలధారణ స్వాములు ప్రత్యేక పూజలు కూడా చేస్తారు.ఇందుకు సంబంధించి నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేశారు.
అంతేకాకుండా ఇక్కడికి తరలి వచ్చిన భారీ భక్తులకు బందోబస్తుగా పోలీస్ వారు కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంచినీటి సౌకర్యం, అన్న దన కార్యక్రమాలను కూడా నిర్వహించారు.