కార్తీక మాసం లో మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు కఠినమైన ఉపవాసాలు పాటిస్తూ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు.తెలుగు లోగిళ్లు మార్గశిర మాసంలో అంతకుమించి పూజలు చేస్తూ ఉంటారు.
ఈ నెలలో లక్ష్మీదేవి పూజ చేస్తే వారి ఇంట్లోకి అష్టైశ్వర్యాలు వస్తాయని భక్తులు నమ్ముతారు.శ్రీ మహావిష్ణువు ఎంతో ఇష్టమైన మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవి కూడా ఎంతో ఇష్టం.
ఈ మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించిన వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.
సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి ఇంటిని పరిశుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి.
ఆరోజు ఉదయం తలస్నానం చేసి దేవుడి ముందు బియ్యపు పిండితో ముగ్గు వేసి, ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి.పూజా విధానం మొత్తం తెలియని వారు కనీసం దీపం పెట్టుకుని అమ్మవారి అష్టోత్తరం చదువుకుని నైవేద్యం సమర్పించాలి.
ఓం మహాలక్ష్మీ చ విద్మహ విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్” అనే మంత్రాన్ని పటిస్తూ పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం సమర్పించి అప్పుడు లక్ష్మీవారవ్రత కథ చెప్పుకుని అక్షతలు తలపై వేసుకోవడం మంచిది.
అమ్మవారికి ఈ మాసంలోనే మొదటి గురువారం నైవేద్యంగా పులగం, రెండవ గురువారం అట్లు, తిమ్మనం,3 వ గురువారం అప్పాలు, పరమాన్నం 4 వ గురువారం చిత్రాన్నం, గారెలు 5 వ గురువారం పూర్ణం, బూరెలు నైవేద్యంగా సమర్పించాలి.5వ గురువారం ఐదు మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి స్వయంగా వండి వడ్డించడం మంచిది.దక్షిణ తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు పొందాలి.
ఈ పూజ చేసినప్పుడు వెళ్లి రమ్మని చెప్పకూడదు.ఎందుకంటే లక్ష్మీదేవి ఎవరైనా ఇంట్లోనే ఉండాలని ఉంటారు కానీ వెళ్లి రమ్మని ఎవరు చెప్పారు.
ఈ నోము నోచే స్త్రీలు గురువారాల్లో తలకు నూనె రాసుకోవడం, జుట్టు చిక్కులు తీసుకోవడం చేయరాదు.సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు.
DEVOTIONAL