హైదరాబాద్ నారాయణగూడ పెట్రోల్ దాడి కేసులో మృతుల సంఖ్య మూడుకు పెరిగింది.వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఈనెల 7వ తేదీన భార్య, ఆమె ప్రియుడితో పాటు ఓ చిన్నారిపై భర్త నాగులసాయి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి మొన్ననే మృతిచెందగా.గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భార్య హారతి, ప్రియుడు నాగరాజు మృతిచెందారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పెట్రోల్ దాడి చేసిన భర్త నాగులసాయి, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు.