డార్క్ సర్కిల్స్.అమ్మాయిలను తీవ్రంగా కలవర పెట్టే సమస్యల్లో ఇది ఒకటి.
కళ్ల చుట్టు ఏర్పడే నల్లటి వలయాలనే డార్క్ సర్కిల్స్ అని అంటారు.ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం, అధికంగా నిద్రపోవడం, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, పలు రకాల మందుల వాడకం వంటి రకరకాల కారణాల వల్ల డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి.
ఇవి చూసేందుకు అసహ్యంగా కనిపించడమే కాదు చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.అందుకే డార్క్ సర్కిల్స్‌ను నివారించుకోవడం కోసం తెగ ప్రయత్నిస్తుంటారు.
మీరు ఈ లిస్ట్‌లో ఉన్నారా.? అయితే ఇకపై డార్క్ సర్కిల్స్‌తో నో టెన్షన్.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్‌ను ఫాలో అయితే వారం రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి.మరి ఇంకెందుకు లేటు ఆ టిప్స్ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టు అప్లై చేసుకుని.
ఓ అరగంట పాటు విశ్రాంతి తీసుకోవాలి.ఆపై వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ క్రమంగా తగ్గుముఖం పడతాయి.
అలాగే చిన్న కీర దోసకాయ, పీల్ తొలగించిన బంగాళదుంపలను తీసుకుని వాటర్‌లో కడిగి సన్నగా తురుముకోవాలి.ఈ తురుము నుండి జ్యూస్‌ను సపరేట్ చేసుకుని ఓ గంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి.ఆపై ఫ్రిడ్జ్‌లో నుండి జ్యూస్‌ను తీసుకుని దూది సాయంతో కళ్ల చుట్టు అప్లై చేయాలి.
అరగంట తర్వాత వాటర్‌తో వాష్ చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇక ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టు అప్లై చేసుకుని.
కాసేపు మసాజ్ చేయాలి.ఇరవై నిమిషాల అనంతరం వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా రోజుకు ఒక సారి చేస్తే డార్క్ సర్కిల్స్ వారం రోజుల్లో మాయం అవుతాయి.