సార్స్‌–కోవ్‌–2 పై ప్రభావవంతంగా పనిచేస్తున్న షార్ప్‌ వర్క్‌స్పేస్‌ ప్రోక్యాట్‌ ఫోటోక్యాటలిస్ట్‌

షార్ప్‌ యొక్క డిస్‌ఇన్‌ఫెక్ట్‌ సొల్యూషన్‌ సామర్ధ్య పరీక్షలను ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ), బెంగళూరు నిర్వహించిందిషార్ప్‌ యొక్క ఫోటోక్యాటలిటిక్‌ పర్యావరణ పరిశుభ్రతా పరిష్కారం అతి స్వల్ప కాంతిని వినియోగించుకుని పనిప్రాంగణాల వ్యాప్తంగా పర్యావరణ పరిశుభ్రతను మెరుగుపరుస్తుందిప్రొడక్ట్‌ కాన్సెప్ట్‌ విభాగం కింద ఐఎఫ్‌ డిజైన్‌ అవార్డు 2022 వద్ద ఈ ఆవిష్కరణను గుర్తించారు

 Sharp Workspace Procat Photocatalyst Found Effective Against Sars- Cov-2, Sars--TeluguStop.com

న్యూఢిల్లీ, 27 జూలై 2022 ః వినూత్నమైన సాంకేతిక ఉత్పత్తులు మరియు పరిష్కారాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన షార్ప్‌ కార్పోరేషన్‌ జపాన్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన షార్ప్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ నేడు తమ డిస్‌ఇన్‌ఫెక్ట్‌ కోటింగ్‌ సొల్యూషన్‌ షార్ప్స్‌ వర్క్‌స్పేస్‌ ప్రోక్యాట్‌ ప్రతిష్టాత్మక గుర్తింపును పొందినట్లు వెల్లడించింది.షార్ప్‌ యొక్క నూతన ఆఫరింగ్‌ను సార్స్‌–కోవ్‌–2 (ఒమైక్రాన్‌ వేరియంట్‌)పై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని, కనిపించే కాంతికి బహిర్గతం చేసిన 8 గంటల తరువాత వైరస్‌ కౌంట్‌ కనిపించని స్థాయికి చేరుకుంటుందని గుర్తించారు.2022లో విడుదల చేసిన షార్ప్‌ యొక్క ఫోటోక్యాటలిటిక్‌ పర్యావరణ పరిశుభ్రత పరిష్కారం నేడు పనిప్రాంగణాల రక్షణ మరియు పరిశుభ్రతా అవసరాలను తీర్చడంతో పాటుగా విస్తృత స్థాయిలో కార్పోరేట్స్‌ మరియు ఇనిస్టిట్యూషన్‌ల వ్యాప్తంగా దీనిని వినియోగిస్తున్నారు.ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ), బెంగళూరు నిర్వహించిన పరీక్షలలో షార్ప్‌ వర్క్‌స్పేస్‌ ప్రోక్యాట్‌ ఫోటోక్యాటలిస్ట్‌ సొల్యూషన్‌ విరుసిడల్‌ యాక్టివిటీని ప్లేక్‌ ఎస్సే పద్ధతిలో బీఎస్‌ఎల్‌ 3 ల్యాబ్‌ సెటప్‌లో సెంటర్‌ ఫర్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ బయోసేఫ్టీల్యాబ్‌లో పరీక్షించారు.

ఈ పరీక్షలలో ఒమైక్రాన్‌ వైరస్‌ను 8 గంటల పాటు టంగ్‌స్టన్‌ ట్రైఆక్సైడ్‌ కోటెడ్‌ ప్లేట్‌ పై ఉంచి 8 గంటల పాటు ఎల్‌ఈడీ ఇల్యుమినేషన్‌లో ఉంచితే గరిష్టంగా ఈ వైరస్‌ లోడ్‌ తగ్గుతుంది.అంతేకాదు, ఈ సొల్యూషన్‌ మానవ శరీరానికి తాకినా ప్రమాదకరం కాదని నిరూపితమైంది.

అదనంగా, షార్ప్‌ ఫోటోక్యాటలిస్ట్‌ ఇప్పుడు ఐఎఫ్‌ డిజైన్‌ అవార్డు 2022ను ఉత్పత్తి నేపథ్య విభాగంలో పొందింది.అతి తక్కువ కాంతి వినియోగించి పనిప్రాంగణాలలో పర్యావరణ పరిశుభ్రత మెరుగుపరుస్తుంది.

ఈ ఐఎఫ్‌ డిజైన్‌ అవార్డులు ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు.ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక ఉత్పత్తులు డిజైన్‌ పరంగా శ్రేష్టతను ఇవి గుర్తిస్తాయి.

ఈ ఫలితాలను గురించి షార్ప్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ షింజీ మినటోగవా మాట్లాడుతూ ‘‘ మెరుగైన వ్యాపారం కోసం నూతన ప్రమాణాలకు కట్టుబడి ఉండే ఒత్తిడి లేని, ఆరోగ్యవంతమైన, సురక్షిత, పర్యావరణ పరంగా రక్షిత కార్యాలయాలను ఏర్పాటుచేయడం ద్వారా వ్యాపార కొనసాగింపును ప్రోత్సహించేందుకు షార్ప్‌ అంకితమై ఉంది.షార్ప్‌ వర్క్‌స్పేస్‌ ప్రోక్యాట్‌ డిస్‌ఇన్‌ఫెక్ట్‌ కోటింగ్‌ సర్వీస్‌తో మా లక్ష్యమేమిటంటే, సురక్షితమైన ఆఫీస్‌ వాతావరణాన్ని అందించడం.

అదే సమయంలో వైరస్‌లు, బ్యాక్టీరియా, మోల్డ్‌, వాసనలు లేవనే భరోసా కల్పించడం. వర్క్‌స్పేస్‌ ప్రోక్యాట్‌ను ఇప్పటికే సుప్రసిద్ధ వర్క్‌ప్లేస్‌లలో వినియోగిస్తున్నారు.

ఈ నూతన సర్టిఫికేషన్‌తో ఇప్పుడు మరిన్ని సంస్థలు ఈ పరిష్కారాలను వినియోగించడంతో పాటుగా తమ పని ప్రాంగణాల వద్ద మరింత ఆత్మవిశ్వాసంతో పనిచేయగలవు.

మా షార్ప్‌ వర్క్‌స్పేస్‌ ప్రోక్యాట్‌కు ఐఎఫ్‌ డిజైన్‌ అవార్డుల నుంచి గుర్తింపు రావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము.

వర్క్‌స్పేస్‌ ప్రొటెక్షన్‌ అభివృద్ధి చేయడంలో మా అంకిత భావానికి ప్రతీకగా ఈ అవార్డు నిలువడంతో పాటుగా పర్యావరణ పరంగా పరిశుభ్రత ఉత్పత్తిగా గుర్తింపు పొందింది.ఈ తరహా మైలురాళ్లు ఈ ప్రపంచం అత్యుత్తమంగా వ్యాపార కొనసాగింపు చేయడంలో సహాయపడాలనే మా లక్ష్యం దిశగా మరింత ముందుకు వెళ్లేందుకు తోడ్పడనుంది’’ అని అన్నారు.

వర్క్‌స్పేస్‌ ప్రోక్యాట్‌ ఫోటోక్యాటలిస్ట్‌ లిక్విడ్‌ను గోడలు,ఉపరితలాలపై స్ర్పే చేయాలి.ఈ ఫోటోక్యాటలిటిక్‌ కోటింగ్‌ను కాంతికి ఎక్స్‌పోజ్‌ చేసినప్పుడు అంటే సహజసిద్ధమైన సూర్యకాంతి లేదా ఎల్‌ఈడీ, ఫ్లోరోసెంట్‌ సహా విజిబిల్‌ లైట్‌తో ఇది శక్తివంతమైన ఆక్సిడైజేషన్‌ మరియు డీకంపోజిషషన్‌ శక్తిని వైరస్‌, బ్యాక్టీరియా, మౌల్డ్‌ వంటివి నాశనం చేయడంతో పాటుగా చెడు వాసనలు, ఇతర ప్రమాదకరమైన ఇతర క్రిములను నాశనం చేస్తాయి.

సొల్యూషన్‌లో యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫౌలింగ్‌ లక్షణాలు కలిగి 365 రోజులూ సమగ్ర రక్షణను అందిస్తుంది.

షార్ప్‌ యొక్క ఫోటోక్యాటలిటిక్‌ మెటీరియల్‌లో ప్రధాన అంశంగా టంగస్టెన్‌ ట్రై ఆక్సైడ్‌ ఉంటుంది.

ఇతర ఫోటోక్యాటలిటిక్‌ మెటీరియల్స్‌లా కాకుండా షార్ప్‌ యొక్క ఫోటోక్యాటలిటిక్‌ మెటీరియల్‌ విస్తృత శ్రేణిలో కాంతికి ప్రభావితం అవుతుంది.ఈ ఫలితంగా ఎల్‌ఈడీలు, ఫ్లోరోసెంట్‌ కాంతికి ఎక్స్‌పోజ్‌ అయినప్పుడు అత్యధికంగా ఆక్సిడేటివ్‌ ఎఫెక్ట్‌ అందిస్తుంది.

షార్ప్‌ యొక్క వర్క్‌స్పేస్‌ ప్రోక్యాట్‌ సర్ఫేస్‌ డిస్‌ఇన్‌ఫెక్ట్‌ సర్వీస్‌ 1000 చదరపు అడుగుల సర్ఫేస్‌ ప్రాంగణం కోసం ఒక సంవత్సరానికి 1,50,000 రూపాయల ఖర్చుతో వస్తుంది.ఈ సర్వీస్‌ ఒక సంవత్సరం వారెంటీతో వస్తుంది.

షార్ప్‌ గతంలో 3డీ సెక్యూర్‌– టోటల్‌ వర్క్‌స్పేస్‌ ప్రొటెక్షన్‌ సొల్యూషన్‌ పరిచయం చేసింది.దీనిలో ఇన్‌స్టెంట్‌ సర్ఫేస్‌ డిస్‌ఇన్‌ఫెక్టెంట్‌ షార్ప్‌ నేచురైజర్‌, డిస్‌ఇన్‌ఫెక్ట్‌ కోటింగ్‌ సర్వీస్‌ వర్క్‌స్పేస్‌ ప్రోక్యాట్‌ మరియు కమర్షియల్‌ ఎయిర్‌ ఫ్యూరిఫయర్‌ ప్లాస్మా క్లస్టర్‌ కూడా ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube