ఇప్పుడు అందరి టార్గెట్ ఒక్కటే.పాన్ ఇండియా సినిమా ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారిపోయింది.
టాలీవుడ్ లో చిన్న హీరో నుండి స్టార్ హీరో వరకు ఎవ్వరిని కదిలించినా ఇదే మాట వినిపిస్తుంది.ప్రతి హీరో, డైరెక్టర్ పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నారు.
మరి ఇప్పటికే బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.ఆ తర్వాత ఇటీవలే వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా పాన్ ఇండియా హీరోలుగా ప్రోమోట్ అయ్యారు.
అలాగే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
వీరంతా పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు.
అయితే బాహుబలి కోసం ప్రభాస్ ఐదేళ్ల సమయం కేటాయించాల్సి వచ్చింది.అలాగే నిర్మాతలు కూడా కొన్ని వందల కోట్లు ఖర్చు చేసారు.
ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించిన చరణ్, ఎన్టీఆర్ పరిస్థితి కూడా ఇదే.ఈ సినిమా కోసం వీరు మూడేళ్ళ సమయం కేటాయించారు.
అయినా కూడా ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ లకు పాన్ ఇండియా స్టార్ గుర్తింపు వచ్చిన ఇందులో ఎక్కువ క్రెడిట్ రాజమౌళి గారికే వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.మరి ఈ విధంగా చూసుకుంటే ఇప్పటి వరకు పాన్ ఇండియా హీరోలు అయినా లిష్టులో బన్నీ నే ముందు వరుసలో ఉన్నాడు.
ఈయన పుష్ప సినిమాతో క్రియేట్ చేసిన మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రాజమౌళితో సినిమా అంటే పాన్ ఇండియా హీరో అవ్వడం ఖాయం అనే రేంజ్ కు హీరోలు ఆలోచిస్తున్నారు.
మరి చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ లను పాన్ ఇండియా హీరోల ఇమేజ్ తెచ్చిపెట్టింది రాజమౌళి నే అని అంటున్నారు.
అయితే రాజమౌళి సాయం లేకుండా పాన్ ఇండియా హీరో అయ్యింది మాత్రం కేవలం బన్నీ అనే చెప్పాలి.పుష్ప పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది.ఎలాంటి అంచనాలు లేకుండానే హిందీలో సైతం 100 కోట్లు కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసాడు.
ఇన్ని నెలలు అవుతున్న ఇప్పటికే అల్లు అర్జున్ మ్యానరిజం ఇంకా చేస్తూ ఈ సినిమా ఏ రేంజ్ లో ఫిదా అయ్యారో చెప్పకనే చెబుతున్నారు.అందుకే పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న వారిలో బన్నీ టాప్ ప్లేస్ లో ఉన్నాడు.