సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆ డేట్ లాక్ చేసుకోండి.. అదిరిపోయే గిఫ్ట్..!

సర్కారు వారి పాట హిట్ తో సూపర్ స్టార్ మహేష్ తన హిట్ మేనియా కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు.ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమా త్రివిక్రం తో చేస్తున్నాడు మహేష్.

 Superstar Surprise Gift For Fans On His Birthday , Mahesh , Mahesh Birthday ,-TeluguStop.com

మహేష్ 28వ సినిమాగా ఈ కాంబో మూవీ క్రేజీగా రానుంది.ఆల్రెడీ త్రివిక్రం తో అతడు, ఖలేజా సినిమాలు చేసిన మహేష్ ఈ సినిమాతో హ్యాట్రిక్ షురూ చేస్తున్నారు.

ఈ హ్యాట్రిక్ మూవీని సంథింగ్ స్పెషల్ అనేలా చేస్తున్నారట.

ఈమధ్యనే హాలీడేస్ ని పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాడు మహేష్.

త్వరలో త్రివిక్రం తో ఫైనల్ మీటింగ్ ఉందని తెలుస్తుంది.త్రివిక్రం స్క్రిప్ట్ లో మహేష్ కొన్ని మార్పులు సూచించాడని టాక్.

త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా నుంచి ఓ సర్ ప్రైజ్ ఇవ్వనున్నారట చిత్రయూనిట్.మహేష్ బర్త్ డే ఆగష్టు 9న త్రివిక్రం, మహేష్ కాంబో సినిమా నుంచి ఓ స్పెషల్ గిఫ్ట్ రాబోతుందని అంటున్నారు.

సినిమా మొదలు పెట్టడమే పోస్టర్ తో సర్ ప్రైజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట.

స్టార్ సినిమా అయినా సరే ఈమధ్య పబ్లిసిటీ అన్నది చాలా ప్రాముఖ్యత చోటు చేసుకుంటుంది.

వరుస ప్రమోషన్స్ తో ఎంత ఆడియెన్స్ లోకి వెళ్తే అంత బజ్ ఏర్పడుతుందని గుర్తించారు.అందుకే స్టార్ సినిమాలకు ఈమధ్య ప్రమోషన్స్ మీద ఫుల్ కాన్సెంట్రేట్ చేశారు.

అందులో భాగంగానే సినిమా ఓపెనింగ్ నాడే టైటిల్ పోస్టర్ కూడా వదులుతున్నారు.అయితే అన్ని సినిమాలకు అది కుదరకపోవచ్చు.

కానీ త్రివిక్రం మాత్రం ముందు టైటిల్ పెట్టాకనే సినిమా తీస్తాడు.సో సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే నాడు మహేష్ 28వ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.

Telugu Mahesh, Mahesh Babu, Pooja Hegde, Trivikram-Movie

ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది.ఆల్రెడీ మహేష్ తో మహర్షి సినిమా చేసిన అమ్మడు త్రివిక్రం డైరక్షన్ లో అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల్లో నటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube