గత కొన్ని వారాలుగా విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాన దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ వారు ఒక సినిమా ను నిర్మించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఆ విషయం లో కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎందుకంటే ఇటీవలే పూరి జగన్నాద్ దర్శకత్వం లో జనగణమన అనే సినిమా ను విజయ్ దేవరకొండ చేయబోతున్నాడు.ఆ సినిమా కు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభించారు.
హీరోగా మరో ఏడాది పాటు పూరి తోనే బిజీగా ఉంటాను అంటూ విజయ్ దేవరకొండ ప్రకటించాడు.దాంతో శివ నిర్వాన సినిమా ఇప్పట్లో పట్టాలు ఎక్కే అవకాశం లేదు అనుకున్నారు.
మీడియా లో వచ్చేవి కేవలం పుకార్లు మాత్రమే అంటూ ప్రచారం చేసిన వారు కూడా కొందరు ఉన్నారు.అయితే తాజాగా సినిమా అధికారిక ప్రకటన వచ్చింది.
అంతే కాకుండా సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు లాంచనంగా జరిగాయి.
సినిమా చిత్రీకరణ ప్రారంభం కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాత్రమే పాల్గొన్నాడు.హరీష్ శంకర్ మొదటి షాట్ కు క్లాప్ కొట్టాడు.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు.
శివ నిర్వాన ఇప్పటి వరకు తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ముఖ్యంగా సమంత తో ఇప్పటికే మజిలీ అనే సినిమా ను చేయడం ద్వారా సక్సెస్ ను అందుకున్న శివ నిర్వాన ఇప్పుడు మరో సారి ఆమె తో సినిమా ను చేయబోతున్న నేపథ్యం లో ఖచ్చితంగా మరో విజయం దక్కే అవకాశాలు ఉన్నాయి.
విజయ్ దేవరకొండ మరియు సమంత కలిసి మహానటి లో నటించారు.ఇప్పుడు మరోసారి శివ నిర్వాన సినిమా లో నటించబోతున్నారు.మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.ఇదే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.