కామాఖ్య ఆలయ చరిత్ర తెలిస్తే షాక‌వుతారు

భారతదేశం హిందూ ధ‌ర్మంతో ముడిప‌డిన దేశం.హిందూమతంతో సంబంధం ఉన్న అనేక చారిత్రక దేవాలయాలు భారతదేశంలోనే కనిపిస్తాయి.

 Kamayakhya Temple Amazing Facts Details, Kamakya Temple, Assam, Gauhati, Kamakhy-TeluguStop.com

పురాణాల ప్ర‌కారం సతీదేవిని విష్ణువు త‌న సుద‌ర్శ‌నంతో 51 ముక్కలుగా న‌రికిన‌ప్పుడు ఆ భాగాలు ప‌డిన ప్రాంతాలు శ‌క్తి పీఠాలుగా ఉద్భ‌వించాయి.ఈ ప్రదేశాలను పవిత్ర పుణ్యక్షేత్రాలు అంటారు.

అందులో కామాఖ్య దేవాలయం కూడా ఒక‌టి.ఇది అస్సాంలోని గౌహతి నీలాంచల్ కొండ ప్రాంతంలో ఉంది.

తాత‌, కమల, భైరవి, భునేశ్వరి, మాతంగి ధూమావతి, త్రిపుర సుందరి మొదలైన 10 దేవీ రూపాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి.ఇప్పుడు మనం కామాఖ్య దేవాలయ చరిత్ర, దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం సతీదేవి తండ్రి అయిన ప్రజాపతి దక్షుడు.త‌న అల్లుడైన‌ శివుడిని ఆహ్వానించకుండా ఒక గొప్ప యజ్ఞం నిర్వ‌హించాడు.ఈ కార్య‌క్ర‌మానికి స‌తీదేవి వెళ్ల‌గా ద‌క్షుడు శివుని గురించి అవ‌మాన‌క‌రంగా మాట్లాడతాడు.దీంతో కోపానికి గురైన సతీదేవి హోమ గుండంలో దూకి ప్రాణత్యాగం చేసింది.

ఈ విషయం శివునికి తెలియడంతో ఆయ‌న‌ మహాయజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి తన భార్య మృత దేహంతో తాండ‌వం చేయ‌డం మొదలుపెట్టాడు.ఆ తరువాత విష్ణువు… శివుని కోపాన్ని చల్లార్చడానికి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా చేశాడు.

Telugu Assam, Gauhati, Kamakhya Temple, Kamakya Temple, Maha Shiva, Satidevi-Eve

ఈ భాగాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల‌లో ప‌డ‌తాయి.సతీ మాత శరీర భాగాలు ప‌డిన ప్రాంతాల‌ను శక్తిపీఠాలుగా పిలుస్తారు.ఈ శ‌క్తి పీఠాల‌లో ఒక‌టే కామాఖ్య ఆల‌యం. కామాఖ్య దేవాలయం ఆకారం ఒక కొలనులా కనిపిస్తుంది, దాని చుట్టూ నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది.పౌరాణిక క‌థ‌నాల‌పై ఉన్న న‌మ్మ‌కాల‌ ప్రకారం ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అంబుబాచి జాతర నిర్వహిస్తారు, ఆ సమయంలో తల్లి కామాఖ్య స్వయంగా రుతుక్రమంలో ఉంటుంది.ఈ కార‌ణంగా దేవాలయంలో ఎర్ర‌ని నీరు బ‌య‌ట‌కు వ‌స్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube