శ్రీరామ నామ జపం గురించి శివుడు పార్వతీ దేవికి ఏం చెప్పాడో తెలుసా?

శ్రీరామ నామ జపం గురించి దాని వల్ల కలిగే లాభాల గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు.కోరిన కోర్కెలు నెరవేర్చే ఆ స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు చాలా మంది రామ కోటి కూడా రాస్తుంటారు.

 Do You Knwo What Lord Shiva Told To Goddess Pravathi About Rama Nama Japam , Pr-TeluguStop.com

అంతే కాదు విష్ణు సహస్ర నామాలు పారాయణం చేస్తే కచ్చితంగా కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం.అయితే అన్ని నామాలు చదవలేని వారి పరిస్థితి ఏంటి అని పార్వతీ దేవి శివుడిని అడిగింది.

అయితే ఈ ప్రశ్నకు ఆ మహా శివుడు విష్ణు సహస్ర నామాలని క్లుప్తంగా ఎలా చదవచ్చో వివరించాడు.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే! సహస్రనామ తత్తుల్యం రామ నార వరాననే!!

వేయి నామాలను పఠించడం వల్ల కలిగే పుణ్యం రామ శబ్దాన్ని స్మరించడం వల్ల కల్గుతుంది.

రామ నామ జపం విష్ణు సహస్ర నామ పారాయణ పలితాన్ని ఇస్తుందని పరమ శివుడు పార్వతీ దేవికి వివరించాడు.రామ అనేది కేవలం ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు.

అది సంసారాన్ని దాటించే బీజాక్షర రూప నావ.హరిని పూజించే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయలో రా అనే అక్షరం, శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయలో మః అన్న శబ్దం కలిపితే రామః అనే శబ్దం రూపు దిద్దుకుంది.శివ కేశవ తత్త్వాల కలయిక రామ అనే పదంలో దర్శనమిస్తుంది.అందుకే రామ నామ జపం స్మరిస్తే పుణ్యం వస్తుందని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube