ములుగు జిల్లా: పుట్టలో ప్రత్యక్షమైన శివలింగం.పూజలు నిర్వహిస్తున్న భక్తులు.
పురాతన కాలం నాటి శివలింగాన్ని దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్తులు.ములుగు జిల్లాలో తవ్వకాల్లో బయటపడిన శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.
మంగపేట మండలం రమణక్కపేట పంచాయితీ పరిదిలోని గుట్టపై చెట్టుకింద పుట్టలో పురాతన శివలింగం బయటపడింది.దేవరబాల గ్రామానికి చెందిన శివభక్తుడు పూజారి తోడేటి కృష్ణ ఈ పురాతన శివలింగాన్ని కనుగొన్నాడు.
చెట్టు కింద పుట్టలో శివలింగం ఉన్నట్టుగా గుర్తించి అర్థరాత్రి సమయంలో తవ్వకాలు జరిపారు.పుట్ట తవ్వుతుండగా రెండు పాములు బయటికి వచ్చిన అవి ఎవరిని ఏమి చేయలేదని పూజారి కృష్ణ తెలిపాడు.
శివలింగాన్ని బయటకు తీసి శుభ్రం చేసి అభిశేకాలు చేపట్టారు.ఈ శివ లింగం బయటపడిన పరిసర ప్రాంతాల్లో గతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపగా ఆలయానికి సంబంధించిన ఆనవాలు బయటపడ్డాయని స్థానికులు తెలిపారు.
ఈ పురాతన శివలింగాన్ని దర్శించుకునేందుకు ములుగు జిల్లాలోని పలు మండలాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.