టాలీవుడ్ నటుడు హీరో శివాజీ ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన గురించి పలు వాఖ్యలు చేశాడు.కొన్ని విషయాల గురించి తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వం పై, ఏపీ ప్రభుత్వం పనితీరుపై విమర్శలు చేశారు.
అంతే కాకుండా అన్ని రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనకబడుతోందని ఆయన తెలిపారు.అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈవీఎం ఎప్పుడు కనపడుతుందా అని ఎదురు చూస్తున్నారు.
తట్టుకోలేకపోతున్నారు.
ఒక మూడు రాజధానులు అన్న అంశం గురించి చూసుకుంటే అద్భుతమైన పరిపాలన చేశారు అని అందరు నమ్ముతున్నారు కదా.ఎన్నికలకు వెళ్దాం ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవడు.ఆ విషయం వాళ్లకు కూడా బాగా తెలుసు.
నేను వాదన యుద్ధం చేసే స్థాయి నాకు లేదు కానీ కొడాలి నాని గారి లాగా కింద స్థాయి మాటలు నేను మాట్లాడలేను అని చెప్పుకొచ్చారు శివాజీ.ఇక నేను కొడాలి నాని ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఆయన గుడివాడ తప్ప నేను మా నియోజకవర్గం తప్ప ఏపీలో ఎక్కడైనా పోటీ పడతాం.
ఒకవేళ ఆ పోటీలో కొడాలి నాని గెలిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని తెలిపారు శివాజీ.ప్రస్తుతం శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలాంటి ఓపెన్ చాలెంజ్ గతంలో సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ చేసిన విషయం తెలిసిందే.అలాంటి చాలెంజ్ హీరో శివాజీ ఇప్పుడు చేయడంతో అందుకు సంబంధించిన వీడియో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మరి శివాజీ ఛాలెంజ్ ఫై ఏపీ మంత్రి కొడాలి నాని ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.హీరోగా, విలన్ గా,నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన శివాజీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు.