గత రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి అన్ని దేశాలను ఒక్కసారిగా భయాందోళనలకు గురి చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ ఏడాది ఒమిక్రాన్ రూపంలో ఒక్కసారిగా అందరినీ భయపెట్టిన ఈ వైరస్ తొందరగా తగ్గిపోవడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.
అయితే అక్కడక్కడ పలువురు ఈ వైరస్ బారిన పడుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ కూడా కరోనా బారినపడినట్లు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చాలా నీరసించి పోయారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇక ఈమె షేర్ చేసిన ఫోటో చూస్తే ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని అర్థమవుతుంది బాగా నీరసించి పోవడమే కాకుండా చాలా డల్ గా కనిపించారు.
ఈ ఫోటో చూసిన ఎంతో మంది ఈమె అభిమానులు ఈమె త్వరగా ఈ వైరస్ నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు.ఇకపోతే నందమూరి నటసింహం బాలకృష్ణ శృతిహాసన్ పరిస్థితి చూసి ఎంతో బాధ పడినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోని ఈమెకు స్వయంగా ఫోన్ చేసి తన బాగోగులు అడిగి తెలుసుకున్నారని సమాచారం.
ఇలా శృతిహాసన్ కు ఫోన్ చేసిన బాలయ్య తన బాగోగుల గురించి కనుక్కొని త్వరగా కోలుకుంటావు తల్లి మా ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయి అంటూ తన తనకు ఎలాంటి సహాయం కావాలన్నా అడగమని ధైర్యంగా ఉండమని చెప్పినట్లు తెలుస్తోంది.బాలయ్య బాబు చూడటానికి కఠినంగా ఉన్న తన మనస్సు ఎంతో మంచిదని మరోసారి ఈ విధంగా నిరూపించుకున్నారు.ఇకపోతే బాలకృష్ణ శృతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.