పిల్లల ప్రాణాలను కాపాడడానికి తల్లిదండ్రులు ఎంతటి రిస్క్ అయిన చేస్తారు.అయితే ఇప్పుడు అది మరొక సారి నిరూపితమయింది.
తాజాగా లూసియానాలో కోడి హుక్స్ అనే 18 ఏళ్ల బుల్-రైడర్ ఒక ఎద్దును రైడ్ చేయడం మొదలుపెట్టాడు.అయితే చాలా అగ్రెసివ్ గా ఉన్న ఆ వైల్డ్ బుల్ అతన్ని బలంగా నేలమీదకు పడేసింది.
ఆపై దాడి చేయడానికి వస్తుండగా వెంటనే ఆ 18 ఏళ్ల కుర్రాడి తండ్రి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.తర్వాత ఆ యువకుడిపై పడుకొని ఎద్దు ఎటాక్ నుంచి కాపాడాడు.
దీనికి సంబంధించిన వీడియోని కోడీ_హుక్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.ఈ వీడియో 1 లక్షా 80 వేల వ్యూస్ తో వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో వైల్డ్ బుల్ దాడి వల్ల నేలపై నిస్సహాయ స్థితిలో పడి ఉన్న కోడి హుక్స్ అనే ఒక యువకుడిని చూడొచ్చు.అనంతరం ఆ భయంకరమైన ఎద్దు అందరిపై దాడి చేయడం మొదలెట్టింది.
ఇంతలోనే కోడి హుక్స్ తండ్రి అయిన లాండిస్ హుక్స్ భయంకరమైన ఆ రింగులోకి ఎంట్రీ ఇచ్చాడు.ఆపై అందర్నీ కుమ్మేస్తున్న ఎద్దు నుంచి తన కొడుకును రక్షించడానికి అతడిపై పడుకున్నాడు.
ఆ వెంటనే సదరు బుల్ కోడి హుక్స్ పై దాడి చేసింది.ఈ సమయంలో కుమారుడికి ఏ మాత్రం గాయం కాకుండా తన ప్రాణాలు పణంగా పెట్టాడు తండ్రి.
అలా తన కుమారుడికి ప్రాణదానం చేసిన ఈ తండ్రి ఇప్పుడు అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు.అసలైన తండ్రి అంటే ఇతడే! ఇలాంటి గొప్ప తండ్రిని కలిగి ఉన్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అమెరికన్ బుల్ రైడింగ్ అనేది ఒక ప్రమాదకరమైన రోడియో స్పోర్ట్స్.దీనిలో పాయింట్ స్కోర్ చేయడానికి, ఒక రైడర్ బుల్‌పైకి ఎక్కి కనీసం ఎనిమిది సెకన్ల పాటు దానిపైనే ఉండాలి.ఈ సమయంలో కేవలం ఒక చేత్తో మాత్రమే గ్రిప్ పట్టుకొని ఉండాలి.ఈ క్రమంలో ఎద్దులు భయభ్రాంతులకు గురవుతుంటాయి.అలాంటప్పుడు అవి రైడర్‌ను విసిరివేయడానికి ఎగురుతుంటాయి.కింద పడిన వారికి చుక్కలు చూపిస్తాయి.
అయినా కూడా ఈ ప్రమాదకరమైన ఆట ఆడుతూ చాలామంది ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.