గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ పై ట్రోలింగ్స్ ఏ రేంజ్ లో జరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే.నెటిజెన్స్ మంచు ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ గత కొద్ది రోజులుగా ఏదో ఒక విషయంలో మంచు ఫ్యామిలీలో ఎవరినో ఒకరి ఫై ట్రోలింగ్స్ చేస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా ప్లాప్ అయ్యిందని ట్రోల్స్ చేస్తున్నారు అంటూ మంచు విష్ణు ట్రోలోంగ్స్ చేసే వారిపై 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.ఈ విషయం పట్ల మంచు ఫ్యామిలీ కూడా చాలా సీరియస్ అయింది.
ఇకపోతే తాజాగా మోహన్ బాబు ఫ్యాన్స్, మంచు ఫ్యామిలీ ని ట్రోల్స్ చేస్తున్న వారిపై కేసు నమోదు చేశారు.మంచు యువసేన ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి.
తిరుపతి అర్బన్ జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో కేసు వేశారు.ఈ సందర్భంగా ఫాన్స్ అసోసియేషన్ లీడర్ సునీల్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ.
గత 20 ఏళ్లుగా మోహన్ బాబు గారి ఫాన్స్ అసోసియేషన్ లీడర్ గా ఉన్నాననీ అయితే ఎప్పుడూ కూడా మోహన్ బాబు ఫ్యాన్స్ వేరే హీరోలపై కామెంట్స్ చేయలేదని, కానీ ఇటీవలే విడుదలైన సన్ ఆఫ్ ఇండియా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత నుంచి కొంత మంది ట్రోలింగ్స్ చేసేవారు మంచు ఫ్యామిలీ పై అసభ్య పదజాలంతో దూషించడం మొదలు పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ కాకముందే 100 కు పైగా యూట్యూబ్ చానల్స్ వారు సినిమా బాగాలేదు అని చెప్పి ట్రోలింగ్స్ చేసి ప్రేక్షకులను ధియేటర్ లకు రాకుండా చేశారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఫిర్యాదు చేశాం అంటూ ఆయన చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా అతను మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.