ట్రంప్ సొంత సోషల్ మీడియా...తొలి “ట్రూత్” ఇదే...

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ను అతి త్వరలో ప్రజలలోకి తీసుకురావడానికి సిద్దమయ్యారు.ట్విట్టర్, ఫేస్ బుక్ ల మీద ఉన్న కోపం, తన భావాలను వ్యక్త పరిచేందుకు ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లేకపోవడంతో తానే సరికొత్త సోషల్ మీడియాను సృష్టించాడు.

 Ex-us President Donald Trump Returns To Social Media Through 'truth Social',trut-TeluguStop.com

తనను నియంత్రించాలని భావించిన అన్ని సోషల్ మీడియాలను తలదన్నే విధంగా తన సొంత మీడియా ఉండాలని నిపుణులచే ప్రత్యేకంగా తయారు చేయించారు.తాజాగా ఈ సోషల్ మీడియా ద్వారా ఓ ట్రూత్ కూడా చేశారు.

ట్విట్టర్ కు ట్వీట్ ఎలాగో, తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ కి కూడా ట్రూత్ అని పేరు పెట్టాడు.అంతేకాదు మొట్ట మొదటి ట్రూత్ ను తన సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు కూడా.

అయితే ట్రంప్ చేసిన ట్రూత్ ను ఆయన తనయుడు జూనియన్ ట్రంప్ ట్విట్టర్ లో షేర్ చేశారు.దాంతో ప్రస్తుతం ట్రంప్ సొంత సోషల్ మీడియా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్విట్టర్ పై కోపంతో ప్రత్యామ్నాయంగా తన మీడియా టీమ్ ఈ సరికొత్త ట్రూత్ సోషల్ మీడియా ను అభివృద్ధి పరిచింది.ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందని ట్రంప్ టీమ్ వెల్లడించింది.

ట్రంప్ తాజాగా ఈ సరికొత్త వేదికలో ట్వీట్ చేశారు “గెట్ రెడీ మీకు ఎంతో ఇష్టమైన అధ్యక్షుడు అతి త్వరలో మిమ్మల్ని కలవడానికి సిద్దంగా ఉన్నారు అని పోస్ట్ చేశారు.ఇదిలాఉంటే మార్చి నాటికి ఇది అందరికి అందుబాటులో వస్తుందని సదరు కంపెనీ సిఈవో డెవిన్ ప్రకటించారు.

ప్రస్తుతానికి ఈ ట్రూత్ మీడియా లో ట్రంప్ ను 175 మంది ఫాలో అవుతున్నారు.

Ex US President Donald Trump Returns To Social Media Through Truth Social

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube