జిల్లాల విభజన పై వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి..!!

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 13 జిల్లాల కలిగిన రాష్ట్రంగా ఏపీ మిగిలిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే 2019 ఎన్నికల ప్రచారంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తాను అంటూ వైయస్ జగన్ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది.

 Ycp Mla Dissatisfied With Division Of Districts Ysrcp, Mla Anam Ramnarayana Redd-TeluguStop.com

కాగా ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్.ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు.13 జిల్లాల కలిగినా ఏపీని ఇటీవల 26 జిల్లాలుగా విభజించారు.అయితే జిల్లాల విభజన పై కొంత మంది అనుకూలంగా వ్యవహరిస్తే మరికొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి.జిల్లాల విభజన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.అశాస్త్రీయంగా విభజన చేయడం సరికాదని పేర్కొన్నారు.

ప్రజా ప్రతినిధులతో చర్చించకుండా కూడా విభజన చేయటం జరిగింది అని అసహనం వ్యక్తం చేశారు.

నీటి కేటాయింపులకు సంబంధించి కూడా.ఎటువంటి చర్చలు జరగలేదని అన్నారు.

ఈ పరిణామంతో సోమశిల, కండలేరు జలాశయలా నీటి పంపకాల్లో వివాదాలు తలెత్తుతాయని హెచ్చరించారు.నీటి కేటాయింపుల విషయంలో ఇప్పటికైనా అధికారులు పునరాలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

అదేవిధంగా రావూరు, కలువాయి, సైదాపురం ప్రజలు నెల్లూరులో ఉండాలని అన్నారు.ఈ మూడు మండలాలకు చెందిన ప్రజలు బాలాజీ జిల్లాలో తమ ని కలపటం పట్ల అసహనంగా ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏది ఏమైనా నా జిల్లా లో విభజన విషయంలో మరోసారి అధికారులు పునరాలోచించాలని కోరారు.

YCP MLA Dissatisfied With Division Of Districts YSRCP, MLA Anam Ramnarayana Reddy, Ys Jagn , New Dist , Ravuru , Kaluvai , Saidapuram - Telugu Kaluvai, Mlaanam, Dist, Ravuru, Saidapuram, Ys Jagn, Ysrcp

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube