బాలీవుడ్‌ నిర్మాత ఆఫర్‌ ను తిరష్కరించిన అల్లు అర్జున్‌, కారణం ఇదే

అల్లు అర్జున్ పుష్ప సినిమా తో బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.ప్రస్తుతం అక్కడ అల్లు అర్జున్ కు విపరీతమైన క్రేజ్ ఉంది.

 Allu Arjun Not Want To Do A Bollywood Movie At This Time , Allu Arjun , Allu A-TeluguStop.com

పుష్ప సినిమా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కోట్ల వసూళ్లను సాధించడం తో అల్లు అర్జున్ తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు. నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి.

సాధారణంగానే సౌత్ సినిమాలకు మరియు సౌత్‌ హీరోలకు బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.అలాంటిది పుష్ప సినిమాతో వంద కోట్లు దక్కించుకున్న అల్లు అర్జున్ కి ఇంకెంత క్రేజ్ ఉండాలి.

అందుకే ఆయనతో సినిమాలు నిర్మించేందుకు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత లు క్యూ కడుతున్నారు.ఇప్పటికే సౌత్‌ లో కూడా బాగా ఫేమస్ అయిన బాలీవుడ్ నిర్మాత ఒకాయన పుష్ప సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ కి దాదాపుగా రూ.50 కోట్ల అడ్వాన్సు ఇచ్చేందుకు ముందుకు వచ్చాడట.భారీ మొత్తంలో ఖర్చు చేసి ఆయన సినిమా నిర్మించేందుకు సిద్ధమంటూ అల్లు అర్జున్ తో అన్నాడట.

కానీ ఇప్పుడే బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ చేయలేను అంటూ అల్లు అర్జున్ సున్నితంగా భారీ అడ్వాన్సులు తిరస్కరించినట్లు తెలుస్తోంది.

Telugu Allu Arjun, Alluarjun, Bollywood, Telugu, Pushpa, Puspa-Movie

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా పై ఫోకస్ పెట్టాడు.ఈ నెలలోనే ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.కనుక ఈ సమయం లో మరో సినిమా గురించి చర్చించడం కరెక్ట్ కాదనే ఉద్దేశం తో అల్లు అర్జున్ ఉన్నాడట.

ఇక అల్లు అర్జున్ సౌత్ లో ఇప్పటికి మూడు సినిమా లకు కమిట్ అయ్యాడు.ఒకటి బోయపాటి శ్రీను తో కాగా మరో రెండు సౌత్ లో భారీ క్రేజీ డైరెక్టర్ లుగా చెబుతున్నారు.

వారు ముగ్గురి తో సినిమాలు పూర్తి చేసిన తర్వాత బాలీవుడ్ సినిమా గురించి ఆలోచించే అవకాశాలు ఉన్నాయి.బాలీవుడ్ నుండి ఈ గ్యాప్ లో ఎంత భారీ మొత్తం ఆఫర్ వచ్చినా కూడా అల్లు అర్జున్ తిరస్కరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

బాలీవుడ్ లో సినిమా చేయడం అనేది ఖాయం అంటూ అల్లు అర్జున్ అంటున్నాడు.కానీ ఇప్పటికిప్పుడు బాలీవుడ్ సినిమా మాత్రం చేయకపోవచ్చని క్లారిటీ ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube