రెండు దశాబ్దాలలో ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ ఎలా ఉందో తెలుసా ?

ప్రభాస్  తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు.రెబెల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు.

 Hero Prabhas Career Graph In These 2 Decades , Prabhas Tollywood , Film Carrer ,-TeluguStop.com

కెరీర్ తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆయన చేసిన పలు సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు.

కానీ ఆ తర్వాత నెమ్మదిగా సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా ఎదిగాడు.

ప్రస్తుతం ఆయన అన్నీ పాన్ ఇండియన్ సినిమాలే చేస్తున్నాడు.ఆయన నటించిన పలు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధం అయ్యాయి.

ఇంతకీ ప్రభాస్ కెరీర్ లో హిట్స్, ఫట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రభాస్ కెరీర్ లో మొదటి సినిమా ఈశ్వర్.

ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు.యావరేజ్ మూవీగా బాక్సాఫీస్ ముందు నిలిచింది.

ఈ సినిమా తర్వాత రాఘవేంద్ర సినిమా చేశాడు.ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

ఆ తర్వాత వచ్చిన వర్షం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.అడవి రాముడు, చక్రం సినిమాలు సైతం పరాజయం పాలయ్యాయి.

అనంతరం వచ్చిన ఛత్రపతి సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది.

Telugu Decades, Bahubali, Eeswar, Carrer, Prabhas, Radhya Shyam-Latest News - Te

అనంతరం వచ్చిన పౌర్ణమి మూవీ యావరేజ్ గా నిలిచింది.మున్నా, బుజ్జిగాడు సినిమాలు సైతం అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.ఆ తర్వాత వచ్చిన బిల్లా సినిమా మంచి హిట్ అందుకుంది.

ఈ సినిమా తర్వాత వచ్చిన ఏక్ నిరంజన్.యావరేజ్ మూవీగా నిలిచింది.

ఆ తర్వాత వచ్చిన డార్లింగ్, మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.రెబల్ ప్లాప్ కాగా.

మిర్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ మూవీస్ రెండూ ఇండస్ట్రీ హిట్ కొట్టాయి.

ఈ సినిమా దెబ్బకు ప్రభాస్ పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు.ఆ తర్వాత వచ్చిన సాహో మూవీ ఎబో ఏవరేజ్ గా నిలిచింది.

ప్రస్తుతం ఆయన నటించిన రాధేశ్యామ్, సలార్ సినిమాలు విడుదల కావాల్సి ఉంది.ఆదిపురుష్ సినిమా షూటింగ్ కొనసాగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube