హిందూ క్యాలెండర్ ప్రకారం నేడు కార్తీక పౌర్ణమి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు కార్తీక పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు.అయితే నేడు పౌర్ణమి కావడం వల్ల చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది.
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణంగా నేడు పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.సాధారణంగా గ్రహణం ఏర్పడే సమయంలో చాలామంది ఎన్నో నమ్మకాలను విశ్వసిస్తారు.
ఈ క్రమంలోనే గ్రహణ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.నేడు ఏర్పడనున్న ఈ పాక్షిక చంద్రగ్రహణం ఈశాన్య ప్రాంతాల్లో పాక్షికంగా ఉత్తర, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలకు పాక్షికంగా చంద్రగ్రహణం కనబడుతుంది.
మరి ఈ చంద్రగ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణ సమయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
గ్రహణ సమయంలో వచ్చేటటువంటి కిరణాలలో అధిక రేడియేషన్ ఉండటం వల్ల ఆ ప్రభావం గర్భంలో ఎదుగుతున్న బిడ్డపై పడుతుంది కనుక గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదని చెబుతారు.కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా మిగిలిన వారు కూడా గ్రహణ సమయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి.
గ్రహణం ఉన్న సమయంలో ఎవరూ కూడా ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తినకూడదు.అలాగే ఈ గ్రహణ సమయంలో ఎవరు స్నానమాచరించ కూడదు గ్రహణం అనంతరం ఇంటిని శుభ్రం చేసే స్నానమాచరించడం ఎంతో ఉత్తమం.అదేవిధంగా గ్రహణం పడుతున్న సమయంలో ఎవరూ నేరుగా చూడకూడదు.అలాగే ఈ గ్రహణ సమయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలను ప్రారంభించకూడదు కేవలం ఈ సమయంలో విశ్రాంతి మాత్రమే తీసుకోవాలి.
లేకపోతే గ్రహణం పడుతున్న సమయంలో ఏదైనా శ్లోకాలు పఠించడం ఎంతో ఉత్తమం.గ్రహణ సమయంలో ఇంటిలో ఆహార పదార్థాలలోను నీటిలోను తులసి ఆకులను లేదా గరికను వేయడం ఎంతో మంచిది.
LATEST NEWS - TELUGU