వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్..

జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ సలహా మండలి సమావేశం పాల్గొన్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.

 Minister Botsa Satyanarayana Comments, Minister Botsa Satyanarayana, Prc To Empl-TeluguStop.com

మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్.

ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.ఇప్పటికే చర్చలు జరిపాము.

ఐ.ఆర్.ప్రకటించాము, ఇస్తున్నాము.ఉద్యోగ సంఘాలు సంయమనం పాటిస్తే అన్ని పనులు అవుతాయి.

ఇది నా విజ్ఞప్తి.బీజేపీ, టిడిపి కానీ ప్రతిపక్షాలుగా ఉన్నాయి కాబట్టి బాధ్యతగా మాట్లాడాలి.

జనసేన బాధ్యత లేని పార్టీ.గాలికి వచ్చి గాలికి పోయేది.దాని గురించి నేను మాట్లాడను.

15వ ఆర్ధిక సంఘం నుంచి వచ్చిన నిధులతో ఏ గ్రామాల్లో విద్యుత్ బిల్లులు బకాయిలు ఉన్నాయో అవి చెల్లించాం.సోము వీర్రాజును కొన్ని పంచాయతీలు తిరిగి బకాయిల లెక్కలు, చెల్లింపులు పరిశీలించమనండి.నిరసనలు, ధర్నాలు దేనికి చేస్తారు ?వరదల్లో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం పకడ్బందీగా సహాయక చర్యలు చేస్తోంది.

ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించారు.ఓ వైపు గండి కొడుతున్నా.

పంట నష్టం, ప్రాణ నష్టం లేకుండా కార్యక్రమాలు చేశారు.

చంద్రబాబు మాదిరిగా ఊకదంపుడు ఉపన్యాసం, పబ్లిసిటీ, రోడ్లమీద పడుకోవడం వంటివి మా ముఖ్యమంత్రి చేయరు.

ఎన్.సి.ఎస్.సంస్థ కుతంత్రాలతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.ఇంకా ఇబ్బంది పెట్టినట్లు అయితే యాజమాన్యం ఇబ్బంది పడే పరిస్థితి ప్రభుత్వం తెస్తుంది.

సాంప్రదాయంగా ఉండి రైతులకు న్యాయం చేస్తే మంచిది.లేదంటే యాజమాన్యం చిక్కుల్లో పడుతుంది.మేము ఔట్ ఆఫ్ ది వే లో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం.

రైతులు లక్షా పది వేల టన్నులు చెరుకు వేస్తామని అగ్రిమెంట్ చేస్తే ఖచ్చితంగా భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు సిద్ధం.

గత ఏడాది 33 వేల టన్నుల చెరుకు మాత్రమే బయటకు అమ్మాము.

ఈ సంవత్సరం 30 వేల టన్నులే వచ్చింది.మూడో వంతు చెరుకు మాత్రమే అక్కడ అందుబాటులో ఉంది.

అంత తక్కువ ఉంటే రైతుతో పాటు ఫ్యాక్టరీ , ప్రభుత్వం కూడా నష్టపోతాయి.గతంతో పోలిస్తే చెరుకు కంటే ప్రత్యామ్నాయ పంట వేస్తేనే రైతులకు లాభసాటిగా ఉంది.

రైతులు ఏ పంట వేస్తే దాన్నే ప్రోత్సహించాలి తప్ప బలవంత పెడితే మిగిలేది నష్టమే.చెరుకు మద్దతు ధర కేంద్రం నిర్ణయిస్తుంది.

అదే మద్దతు ధర ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube