దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కలకలం సృష్టిస్తున్న సమయంలో ఎంతో మంది నిరు పేదలకు సహాయం చేసిన రియల్ లైఫ్ హీరో సోను సూద్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ప్రస్తుతం “సోను సూద్” ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క ప్రజలకు సేవ చేసేందుకు మొదలు పెట్టిన ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సహాయ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు.
అయితే ఇటీవలే సోనూసూద్ ఇంటిపై కొంతమంది ఇన్కమ్ టాక్స్ అధికారులు ఐటీ సోదాలు నిర్వహించి ప్రజల నుంచి సేకరించిన విరాళాలు ఖర్చు పెట్ట లేదని దాదాపుగా 18 కోట్ల రూపాయలకు పైగా సొమ్ము ఫౌండేషన్ ఖాతాలో ఉండి పోయిందని తెలియజేశారు.దీంతో సోనూ సూద్ కూడా ప్రస్తుతం తాను సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో కొంతమేర బ్రేక్ ఇచ్చానని దాంతో అలాగే కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి విరాళం డబ్బులు అందుతాయని అందులో ఎలాంటి సందేహం లేదని క్లారిటీ ఇచ్చాడు.
కాగా ఇటీవలే ఓ విద్యార్థిని కి ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోవడంతో చదువుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.దీంతో విద్యార్థినికి చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయురాలు ఈ విషయం గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నటుడు సోనూసూద్ ని ట్యాగ్ చేస్తూ చిన్నారికి చదువుకునేందుకు సెల్ ఫోన్ సహాయం చేయాలని కోరింది.
దీంతో వెంటనే ఈ విషయంపై తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందించాడు.ఇందులో భాగంగా సిమ్ కార్డు ని రెడీ చేసుకోమని తొందర్లోనే సెల్ ఫోన్ మీ ఇంటికి వస్తుందంటూ తెలిపాడు.
దీంతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కొందరు కావాలనే నటుడు సోను సూద్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సహాయం చేసే వారిని ప్రోత్సహించాలి తప్ప ఇబ్బందులకు గురి చేయకూడదని సూచిస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సోనూసూద్ హిందీలో చంద్రప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న ప్రిథ్వి రాజ్ అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముంబై నగర పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య అనే చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.