పాపం ఉదయభాను.. ఆమెకే తెలియకుండా సినిమాలో ఘోరంగా చూపించారట!

సినీ ఇండస్ట్రీలో చాలా వరకు కొన్ని మోసాలు ఉంటాయి.అందులో అవకాశం ఇస్తామని చెప్పి హీరోయిన్లను లొంగ తీసుకోవడం, పారితోషికం విషయంలో మోసాలు చేయడం ఇలా చాలా వరకు ఏదో ఒక విషయంలో నటీనటులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు.

 Anchor Udaya Bhanu Struggles In Film Industry, Anchor Udaya Bhanu, Udaya Bhanu-TeluguStop.com

ఇక కొందరు దర్శకులు నటీనటులకు కథ చెబుతున్న సమయంలో అందులో ఉండే కొన్ని బోల్డ్ సన్నివేశాలను చెప్పకుండా కూడా మోసం చేస్తారు.ఇదిలా ఉంటే నటి, యాంకర్ ఉదయభానును కూడా ఓ దర్శకుడు మోసం చేశాడు.

ఒకప్పుడు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్న ఉదయభాను తన మాటలతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.యాంకర్ గా గలగలా మాట్లాడుతూ అందరిని ఫిదా చేసింది.

బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.మొదటిసారి ఎర్రసైన్యం సినిమాతో పరిచయమైంది.

తర్వాత పలు సినిమాలలో కొన్ని పాత్రలలో నటించింది.అంతేకాకుండా స్పెషల్ సాంగ్ లలో కూడా మెప్పించింది.

Telugu Anchorudaya, Tollywood, Udaya Bhanu, Udayabhanu-Movie

ఇక బుల్లితెరలో యాంకర్ గానే కాకుండా కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది.గతంలో ఈమె కొన్ని వ్యక్తిగత విషయాలలో కూడా హాట్ టాపిక్ గా మారింది.సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా కనిపించదు.కానీ కొన్ని కొన్ని విషయాలను పంచుకుంటుంది.సమాజంలో జరిగే అన్యాయాలపై బాగా స్పందిస్తుంది.ఇదిలా ఉంటే 2004లో ఓ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుంది.

ఇక వీరికి చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు కవల పిల్లలు కూడా పుట్టారు.ఇక అప్పటి నుంచి సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయ్యింది.

ఇక మధ్య మధ్యలో బుల్లి తెర పై పలు కార్యక్రమంలో కూడా పాల్గొంటుంది.

Telugu Anchorudaya, Tollywood, Udaya Bhanu, Udayabhanu-Movie

ఇదిలా ఉంటే గతంలో ఉదయభాను ఘోర అవమానానికి ఎదుర్కొంది.2013లో రాజ్ శ్రీధర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా మధుమతి. ఈ సినిమాలో ఉదయభాను, దీక్ష, శివ కుమార్ నటీనటులుగా నటించారు.

ఇక ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉండగా ఆ సన్నివేశాల విషయంలో డైరెక్టర్ పై ఉదయభాను ఫైర్ అయ్యిందని తెలిసింది.ఆమెకు తెలియకుండానే ఆమె ఎక్స్ పోజింగ్ సన్నివేశాలను తీసి అందులో పెట్టడంతో అతడిపై ఫైర్ అయ్యి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Telugu Anchorudaya, Tollywood, Udaya Bhanu, Udayabhanu-Movie

దీంతో ఆ సమయంలో ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.ఆ తర్వాత తను ఏ సినిమాలోనైనా నటించిన ముందుగానే దర్శకులకు తన పాత్రల గురించి వివరించేదట.ఆ తర్వాత ఓ పుకారు కూడా ఎదుర్కొంది.అందులో తను ఓ దర్శకుడితో సంబంధం పెట్టుకున్నట్లు బాగా వైరల్ గా మారింది.ఇక ఆ తర్వాత దర్శకుడు ఈ పుకార్లు పై స్పందించి.ఉదయభానుకు, తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపాడు.

ఈ విషయంలో కూడా ఉదయభాను మానసికంగా బాగా కుంగిపోయింది.ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఉదయభాను కెరీర్ మొత్తం మారిపోయింది.

తన లైఫ్ ను భర్త, పిల్లలతో సరదాగా గడుపుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube