1.అమెరికాలో పెళ్లి.ఆన్లైన్ లో ఆశీస్సులు
అమెరికాలో జరిగిన పెళ్లికి తల్లిదండ్రులు ఆశీర్వచనాలు ఆన్లైన్ లో పంపించిన సంఘటన ఆంధ్రా లోని గుంటూరు జిల్లా వినుకొండ లో చోటుచేసుకుంది.స్థానికంగా నివాసం ఉంటున్న తెళ్ల వెంకట కృష్ణారావు శాంతి దంపతుల కుమారుడు గ్రీష్మంత్ గోల్డ్ ఒంగోలుకు చెందిన శ్రీ రామమూర్తి ,శోభారాణి ల కుమార్తె అనుజ్ఞ వివాహాన్ని అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించారు. కరోనా నిబంధనల కారణంగా వధూవరుల తల్లిదడ్రులు అమెరికా వెళ్లేందుకు సాధ్యం కాకపోవడంతో ఆన్లైన్ ద్వారా ఆశీస్సులు అందించారు.
2.ఇంజినీరింగ్ ప్రవేశాలో ఎన్నారై కోట 15%
ఇంజనీరింగ్ సీట్ల భర్తీని ఏపీ ప్రభుత్వం చేపట్టింది.ఇంజనీరింగ్ సీట్ల భక్తులు ఎన్ఆర్ఐ కోటా కింద 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు.
3.యూకే తెచ్చిన గ్లోబల్ టాలెంట్ వీసా ఇదే
యూకే లో ఉద్యోగాలు చేసేవారికి గతంలో టైర్ వన్ ఎక్సెప్షన్ టాలెంట్ వీసా ఇచ్చేవారు అయితే ఇప్పుడు ఆ స్థానంలో ‘ గ్లోబల్ టాలెంట్ వీసా ‘ ను యూకే ప్రభుత్వం తీసుకొచ్చింది.
4.పేరెంట్స్ కు దుబాయ్ పోలీసుల వార్నింగ్
వాహనాల్లో పిల్లలను ఒంటరిగా వదిలివేస్తున్న పెరంట్స్ కు దుబాయ్ పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు.ముఖ్యంగా వేడి వాతావరణం లో పిల్లలను కార్లలో ఒంటరిగా వదలవద్దు అని హెచ్చరించారు.
5.పాకిస్థాన్ లో ఉగ్ర దాడి
పాకిస్థాన్ లో మరోసారి ఉగ్రవాదులు దాడులకు దిగారు.బలుచిస్తాన్ ప్రవీన్స్ లో ఈరోజు ఆత్మాహుతి దాడి జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
6.ఆల్ ఖైదా తో చేతులు కలిపిన తాలిబన్లు
తాలిబాన్లకు ఇబ్బందికరంగా మారిన పంజ్ షీర్ ప్రావిన్స్ పై దాడి చేసేందుకు తాలిబన్లు ఆల్ ఖైదా తో జతకలిసారు.
7.ఆప్ఘనిస్తాన్ లో ఎన్నికలు నిర్వహించాలి.
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటుకి ఆలస్యం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎన్నికలు నిర్వహించాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తెలిపారు.
8.ప్రపంచ వ్యాప్తంగా సీ.1.2 వేరియంట్ కలకలం
ప్రపంచ వ్యాప్తంగా సీ.1.2 కరోనా వేరియంట్ విజృంభిస్తుండడం తో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
9.భారత్ కు తాలిబన్ల షాక్
చైనా తమ మిత్ర దేశం అంటూ ప్రకటించి భారత్ కు తాలిబన్లు షాక్ ఇచ్చారు.
10.చైనా ను వణికిస్తున్న భూకంపం
చైనాలో వరుసగా భూ కంపాలు సంభవిస్తున్నాయి.ఉయ్ గుర్ ఫ్రావీన్స్ లో జిన్ జియాంగ్ లో భయాందోళనకర వాతావరణం నెలకొంది.