సాధారణంగా మనిషి అన్న తర్వాత నిద్రపోతున్న ఏదో ఒక సమయంలో కలలు రావడం అనేది సర్వసాధారణం.కొందరు కలలు రాత్రులు కంటే మరికొందరికి పగలు నిద్ర పోతున్నా కలలు వస్తుంటాయి.
అయితే ఆ కలలు ఒక్కొక్కసారి భయంకరమైనవిగా వుంటాయి.అలాంటి కలలు వచ్చినపుడు అందరూ నిజంగా జరుగుతాయని చాలా కంగారు పడుతుంటారు.
నిజానికి కలలు జరగబోయే వాటికి ముందుగా సంకేతాలను తెలియజేస్తున్నాయని మరి కొందరు భావిస్తారు.ఇలా కలలో ఏవేవో వస్తుంటాయి.
వీటితోపాటు మరికొందరికి దేవతలు కలలో కనిపిస్తుంటారు.ఇలా ఎవరి కలలో నైనా వినాయకుడు కనిపిస్తే అర్థం ఏమిటి? వినాయకుడు కలలో కనిపించడం వల్ల ఎలాంటి పరిణామాలు కలుగుతాయి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
పార్వతి తనయుడు అయినటువంటి బొజ్జ గణపయ్య కలలో కనపడితే ఏ మాత్రం కంగారు పడాల్సిన పనిలేదు.ఎందుకంటే గణపతిని మనం విఘ్నాలు తొలగించే విగ్నేశ్వరుడుగా, శుభాలను కలిగించే ప్రథమ పూజ్యుడిగా పూజిస్తాము కనుక వినాయకుడు మన కలలో కనబడితే అన్ని శుభ పరిణామాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.వినాయకుడు కలలో కనిపించడం వల్ల అక్కడితో మన విజ్ఞాలన్ని తొలగిపోయి జీవితంలో మనము విజయానికి చేరుకుంటామని సంకేతం.
అదేవిధంగా మనం చేసే ఎలాంటి శుభకార్యాలలోనైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పనులను పూర్తి చేయాలని ముందుగా మనం వినాయకుడి పూజ చేసిన తర్వాతే ఏ పూజ అయినా చేస్తాము.
శుభానికి, మంచికి మారుపేరు గణేశుడు కలలో కనిపిస్తే ఆశీస్సులు అన్నివేళలా మనపై ఉండి మనకు జీవితంలో విజయాలు కలుగుతాయని అర్థం.అలాగే మనం ఏదైనా ఓ మంచి కార్యం తలపెట్టి ఇతర కారణాల వల్ల ఆ పని చేయడం మరిచిపోయిన పక్షంలో ఈ విధంగా వినాయకుడు కలలో కనిపిస్తారు.వినాయకుడు కలలో కనపడితే ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదని మనకు శుభం జరుగుతుందని చెప్పడానికి, మనం ఇచ్చిన మాటను నెరవేర్చాలని తెలియజేయడానికి మాత్రమే వినాయకుడు కలలో కనిపిస్తారని చెప్పవచ్చు.
LATEST NEWS - TELUGU