రావణాసుర సినిమాకు 'ధమాకా' సెంటిమెంట్ వర్కౌట్‌ చేస్తున్న మాస్ రాజా

మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం రావణాసుర సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.గత చిత్రం ధమాకా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో రావణాసుర పై అంచనాలు ఆ స్థాయిలోనే ఉన్నాయి.

 Raviteja Ravanasura Movie Promotions Started , Raviteja Ravanasura Movie,dhamaka-TeluguStop.com

అందుకే ధమాకా సినిమా కు చేసినట్లుగానే ప్రమోషన్ కార్యక్రమాలు యాక్టివ్ గా చేయాలని రవితేజ భావిస్తున్నాడు.ధమాకా సినిమా కి ముందు రవితేజ తన సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు పెద్దగా హాజరయ్యేవాడు కాదు.

అంతకు ముందు ఒకటి రెండు ఇంటర్వ్యూలో పాల్గొని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మాత్రమే పాల్గొనేవాడు.కానీ ధమాకా సినిమా కి మాత్రం ఆయన ఏకంగా 10 రోజుల పాటు సమయం కేటాయించి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Telugu Dhamaka, Ravanasura, Raviteja-Movie

రవితేజ సినిమా కోసం చేసిన ప్రమోషన్‌ కార్యక్రమాలు బాగా ఉపయోగపడ్డాయి.సినిమా కి పాజిటివ్ టాక్ రావడం తో భారీ ఎత్తున కలెక్షన్స్ వచ్చాయి అనడం లో సందేహం లేదు.100 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేసిన ధమాకా సినిమా కు చేసినట్లుగానే ప్రమోషన్ కార్యక్రమాలను రావణాసుర సినిమా కు కూడా చేయాలని నిర్ణయించారు.సమ్మర్ కానుక గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రావణాసుర సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి.

Telugu Dhamaka, Ravanasura, Raviteja-Movie

ఇటీవల ఒక సాంగ్ విడుదలకు సంబంధించిన హడావుడి సోషల్ మీడియా లో సందడి చేసింది ఏప్రిల్ ఏడవ తారీఖున విడుదల కాబోతున్న రావణాసుర సినిమా లో రవితేజ విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్నాడు.ఆ సినిమా మరోసారి రవితేజ స్థాయిని నిరూపించబోతుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు.రవితేజ మరో వైపు టైగర్ నాగేశ్వరరావు తో రాబోతున్న విషయం తెల్సిందే.ఆ సినిమా కూడా చాలా అంచనాలను మోస్తోంది.తప్పకుండా ఈ రెండు సినిమా లు విజయాన్ని సొంతం చేసుకుంటాయి అంటున్నారు.మరి ఎంత వరకు రవితేజ మాస్ ఇమేజ్ ఈ రెండు సినిమాలకు వర్కౌట్ అవుతాయి అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube