గేమ్ చేంజర్ టైటిల్ విషయంలో రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ అసంతృప్తి.. ఇదే కారణం!

రామ్‌ చరణ్ హీరోగా శంకర్( Shankar ) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కు గేమ్‌ చేంజర్ ( game changer )అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది.భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

 Ram Charan Fans Unhappy Whit Game Changer Title , Flim News, Game Changer Movie,-TeluguStop.com

కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో అంజలి కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.మొత్తానికి రామ్ చరణ్ ( Ram Charan )మరియు శంకర్ కాంబో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు శంకర్ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు.అయితే టైటిల్ విషయంలో మెగా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారంటూ టాక్ వినిపిస్తుంది.

గేమ్‌ చేంజర్ అనే టైటిల్ ఇంగ్లీష్ లో ఉండటం వల్ల క్యాచీగా లేదనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.అయితే అన్ని భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఇలా ఇంగ్లీష్ టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

ఇలా ఇంగ్లీష్ కాకుండా సింపుల్ గా సీఈఓ లేదా ఇంకేదైనా ముందుగా అనుకున్నది ఖరారు చేసి ఉంటే బాగుండేది కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మెగా ఫ్యాన్స్( Mega fans ) టైటిల్ విషయంలో పూర్తి సంతృప్తితో ప్రస్తుతానికి అయితే లేరు.కానీ సినిమా విడుదల తర్వాత టైటిల్ కు కథకు సరిగ్గా సెట్ అయిందని అంటారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి టైటిల్ విడుదల అయినప్పటి నుండి అంచనాలు భారీగా పెరిగాయి.

అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు శంకర్ సినిమాను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న గేమ్ చేంజర్ తర్వాత బుచ్చి బాబు దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే.

ఇద్దరి కాంబో సినిమా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.కానీ ఇప్పటి వరకు సినిమా షూటింగ్ ఎప్పుడు అనేది క్లారిటీ రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube