కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటించిన చిత్రం దేవర.( Devara ) ఇందులో బాలీవుడ్ బ్యూటీ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఈనెల 27వ తేదీన విడుదల కానుంది.ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ బిజీగా ఉన్నారు.కాగా తారక్ మంచి డాన్సర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.
చిన్నప్పటి నుంచి డాన్స్ లో శిక్షణ తీసుకున్నాడు.

క్లాసికల్ డాన్స్ కూచిపూడి( Kuchipudi ) కూడా నేర్చుకున్నాడు.అంతేకాకుండా చిన్నప్పుడు పలు స్టేజ్ పెర్ఫార్మన్స్ లు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.తాజాగా ఎన్టీఆర్ తన కూచిపూడి శిక్షణ గురించి మాట్లాడారు.
ఎన్టీఆర్ నిన్న దేవర ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైకి( Chennai ) వెళ్లి అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారు.ఆ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.
చెన్నై నాకు చాలా స్పెషల్ ప్లేస్.చాలా మందికి తెలీదు.
నేను చిన్నప్పుడు కూచిపూడి నాట్యం ఇక్కడ చెన్నైలోనే వెంపటి చిన సత్యం సర్( Vempati Chinna Satyam ) దగ్గరే నేర్చుకున్నాను.అందుకే నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం అని తెలిపారు.
ఈ మేరకు తారక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా ఇండియాలోనే లెజెండరీ కూచిపూడి నాట్యకళాకారులు, గురువు దివంగత వెంపటి చిన సత్యం.ఆయనకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో పాటు ఎన్నో నాట్య అవార్డులు, బిరుదులు వచ్చాయి.అలాంటి లెజెండరీ కళాకారుల వద్ద కూచిపూడి నేర్చుకున్నారు తారక్.
కాగా ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ఇటీవలే దేవర షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు.ఈ సినిమా విడుదల తర్వాత వార్ 2 సినిమా షూటింగ్లో పాల్గొన బోతున్నారు ఎన్టీఆర్.
ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది.