విలక్షణ కథలను ఎంచుకుంటూ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలల్లో నటిస్తూ మాస్ ఆడియెన్స్ కు కూడా చేరువయ్యాడు ఆది సాయికుమార్.ఆయన తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్‘.
ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది.చిత్రంలో ఆది సాయికుమార్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా.
సునీల్, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు.
చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్, టీజర్‌లు, ఫస్ట్ సింగిల్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి.ఫస్ట్ సింగిల్ పాప ఆగవే అంటూ సాగే ఈపాటలో ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది.
తాజాగా ‘సమయానికే’ అంటూ ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.ఇది మెలోడీ గీతం కాగా.
ఇందులో ఆది, పాయల్ రాజ్‌పుత్‌ల జోడి ఆకట్టుకుంది.ఈ పాటలో పాయల్ అందాలు హైలెట్ అవుతున్నాయి.
ఆది సాయి కుమార్ ఈ పాటలో షర్ట్ లేకుండా కనిపించారు.ఇక ఆయన చేసిన వర్కవుట్లు, శరీరాకృతిని మార్చుకునేందుకు పడిన కష్టం ఈ వీడియో సాంగ్‌లో కనిపిస్తోంది.
ఇక ఈ పాట సాయి కార్తీక్ అద్భుతమైన మెలోడీ ట్యూన్‌ను అందించగా.రాకేందు మౌళి సాహిత్యాన్ని సమకూర్చారు.
ఇక శృతి ఈ పాటను ఆలపించారు.ఈ వీడియో సాంగ్‌లో ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్‌లు యూత్ ఆడియెన్స్ కట్టిపడేశారు ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఎక్కడా ఖర్చుకు వెనక్కు తగ్గకుండా భారీ బడ్జెట్ లేటాయించి ఈ సినిమాను రూపొందించారు నిర్మాతలు.స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్.
ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు.
మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు.
ఈ చిత్రం ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నటీనటులు
ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ , పూర్ణ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : విజన్ సినిమాస్,డైరెక్టర్ : కళ్యాణ్ జి గోగణ ,ప్రొడ్యూసర్ : నాగం తిరుపతి రెడ్డి,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : యాళ్ల తిర్మల్ రెడ్డి, మ్యూజిక్ : సాయి కార్తీక్,ఎడిటర్ : మణికాంత్, సినిమాటోగ్రాఫర్: బాల్ రెడ్డి,పీఆర్వో : సాయి సతీష్ , పర్వతనేని రాంబాబు
.