విజయ్ దేవరకొండ నా ఫేవరేట్ స్టార్ - మిస్ ఇండియా సినీ శెట్టి

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్ బేస్ పాన్ ఇండియా స్థాయిలో పెరుగుతోంది.మామూలు ప్రేక్షకుడి నుంచి సెలబ్రిటీల దాకా విజయ్ అభిమానులం అని చెప్పుకుంటున్నారు.

 Miss India Sini Shetty Says She Likes Vijay Devarakonda In Tollywood,vijay Devar-TeluguStop.com

తెరపై ఈ స్టార్ హీరో నటన, వివాదరహితమైన ఆఫ్ స్క్రీన్ వ్యక్తిత్వం, ఛారిటీలకు ముందుండే మంచి మనసు కలిసి విజయ్ ను ప్రతి ఒక్కరూ లవ్ చేసేలా చేస్తున్నాయి.తాజాగా మిస్ ఇండియా వరల్డ్ గా ఎంపికైన కన్నడ యువతి సినీ శెట్టి కూడా విజయ్ దేవరకొండ తన ఫేవరేట్ స్టార్ అని చెప్పింది.

ఆయనను కలిసే సందర్భం వస్తే చాలా సంతోషిస్తానని తెలిపింది.
పెళ్లి చూపులు, టాక్సీ వాలా, అర్జున్ రెడ్డి, గీత గోవిందం…ఇలా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగుతో పాటు పాన్ ఇండియా స్టార్ అయ్యారు విజయ్ దేవరకొండ.

ఆయన నటించిన అర్జున్ రెడ్డి సినిమా హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ అయ్యి అక్కడా సూపర్ హిట్ అయ్యింది.దీంతో బాలీవుడ్ లో విజయ్ క్రేజ్ పెరిగింది.

పలువురు బాలీవుడ్ స్టార్స్ విజయ్ ఫేవరేట్ అని చెప్పుకోవడం అతని క్రేజ్ కు నిదర్శనం.విజయ్ లేటెస్ట్ మూవీ లైగర్ రిలీజ్ కు ముందే దేశవ్యాప్తంగా సెన్సేషనల్ బజ్ క్రియేట్ చేస్తోంది.

ఇటీవల ముంబైలో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చిన స్పందన అక్కడి స్టార్స్ ను కూడా ఆశ్చర్యపరిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube